Hazratullah Zazai Daughter Died: స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. పాప మృతి.. గుండెను మెలిపెడుతున్న ఫొటో
Hazratullah Zazai Daughter Died: స్టార్ క్రికెటర్ గుండె పగిలింది. అతని గారాల పట్టీ, నాలుగు నెలల కూతురు మరణించింది. ఆ చిన్నారి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లరి చేస్తూ, ఆడుతు పాడుతూ తిరిగే హజ్రతుల్లా కూతురు మరణించింది. నాలుగు నెలల ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో హజ్రతుల్లా కుటుంబంతో పాటు అఫ్గాన్ క్రికెటర్లు, ఫ్యాన్స్ తీరని బాధలో మునిగిపోయారు. ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు. ఆ చిన్నారి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరీం పోస్టుతో
హజ్రతుల్లా జజాయ్ కు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు నాలుగేళ్ల చిన్నారి మరణించినట్లు తెలుస్తోంది. ఆమె మృతికి కారణాలు వెల్లడి కాలేదు. హజ్రతుల్లా టీమ్ మేట్ కరీం జనత్ ఇన్ స్టాలో పెట్టిన పోస్టుతో ఈ విషయం బయటకు తెలిసింది.
‘‘నా సోదరుడి లాంటి హజ్రతుల్లా తన తనయను కోల్పోయాడని మీతో పంచుకోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఈ కఠిన పరిస్థితుల్లో అతని, అతని కుటుంబం పట్ల బాధతో నా గుండెకు నొప్పి కలుగుతోంది. ఈ ట్రాజిక్ లాస్ లో ఉన్న ఆ కుటుంబం కోసం ప్రార్థనలు చేయండి. హజ్రతుల్లాకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నా’’ అని ఇన్ స్టాగ్రామ్ లో చిన్నారి ఫొటోను కరీం పోస్టు చేశాడు.
తీరని శోకం
నెలల పాప మరణంతో హజ్రతుల్లా కుటుంబం తీరిన శోకంలో మునిగిపోయింది. ఆ కుటుంబానికి దేవుడు కన్నీళ్లు మిగిల్చాడని తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ సంతాపం తెలుపుతున్నారు. చిన్నారి ఫొటో చూసి కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ సమయంలోనే స్ట్రాంగ్ గా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఆటలో అదుర్స్
అఫ్గానిస్థాన్ క్రికెటర్ హజ్రతుల్లా ఆటలో అదరగొడుతున్నాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన క్రికెటర్ గా యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ సరసన హజ్రతుల్లా చేరాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అంతే కాకుండా ఓ ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి అఫ్గాన్ క్రికెటర్ గా హజ్రతుల్లా నిలిచాడు. 2018లో అఫ్గానిస్థాన్ ప్రిమియర్ లీగ్ లో ఓ మ్యాచ్ లో అతను ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.
కీ ప్లేయర్ గా
హజ్రతుల్లా జజాయ్ అఫ్గానిస్థాన్ టీమ్ లో కీ ప్లేయర్ గా ఎదిగాడు. పవర్ హిట్టింగ్ తో చెలరేగుతున్నాడు. అఫ్గాన్ తరపున హజ్రతుల్లా 16 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. 26 ఏళ్ల హజ్రతుల్లా వన్డేల్లో 361 పరుగులు చేశాడు. టీ20ల్లో 1160 పరుగులు సాధించాడు.
సంబంధిత కథనం