Afghanistan Cricket Team: ఇండియాలో ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్.. షెడ్యూల్ ఇదీ
Afghanistan Cricket Team: మూడు టీ20ల సిరీస్ కోసం ఇండియాకు రానుంది ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్. వచ్చే ఏడాది జనవరిలో ఈ సిరీస్ ఇండియాలోని మూడు నగరాల్లో జరగనుంది.
Afghanistan Cricket Team: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్ ఇండియాకు వస్తోంది. మూడు టీ20ల సిరీస్ కోసం ఆ టీమ్ రానున్నట్లు అక్కడి క్రికెట్ బోర్డు మంగళవారం (నవంబర్ 21) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వన్డే వరల్డ్ కప్ ముగియడంతో ఇక వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా సాధ్యమైనన్ని ఎక్కువ టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్, సౌతాఫ్రికాతో మరో టీ20 సిరీస్ ఈ ఏడాది జరగనున్నాయి. ఇక ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ టీమ్ వచ్చే ఏడాది జనవరిలో మూడు టీ20ల కోసం ఇండియాకు వస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. తొలిసారి ఇండియా, ఆఫ్ఘన్ టీమ్ మధ్య ఓ ద్వైపాక్షిక సిరీస్ జరగబోతోంది.
ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
ఇండియా, ఆఫ్గన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జనవరి 11న మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరుగుతుంది. ఇక రెండో మ్యాచ్ జనవరి 14న ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఉంటుంది. చివరిదైన మూడో టీ20 జనవరి 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ షెడ్యూల్ ను ఏసీబీ తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ వన్డే, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ లలో మాత్రమే తలపడ్డాయి. టెస్టుల్లో తలపడినా.. వైట్ బాల్ క్రికెట్ లో మాత్రం ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఈ మధ్యే ముగిసిన వరల్డ్ కప్ లో నాలుగు విజయాలతో ఆఫ్ఘనిస్థాన్ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలాంటి టాప్ టీమ్స్ తోపాటు నెదర్లాండ్స్ ను ఓడించింది.
ఒక దశలో సెమీస్ రేసులో నిలిచినా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓటములతో లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టింది. ఆ టీమ్ ప్లేయర్స్ ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, హష్మతుల్లా షాహిది, రహ్మత్ షా, రహ్మనుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్ టాప్ ఫామ్ లో ఉన్నారు. దీంతో ఆ టీమ్ లో సిరీస్ అంత సులువు కాదు.
టాపిక్