Cricket: ఇంత భారీ నోబాల్ ఎప్పుడైనా చూశారా!: వీడియో.. అవాక్కవుతున్న నెటిజన్లు-abhimanyu mithun bowls bizarre no ball in abu dhabi t10 league video goes viral ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Abhimanyu Mithun Bowls Bizarre No Ball In Abu Dhabi T10 League Video Goes Viral

Cricket: ఇంత భారీ నోబాల్ ఎప్పుడైనా చూశారా!: వీడియో.. అవాక్కవుతున్న నెటిజన్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 03, 2023 05:29 PM IST

Cricket: అబుదాబి టీ10 టోర్నీలో ఓ బౌలర్ భారీ నోబాల్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Cricket: ఇంత భారీ నోబాల్ ఎప్పుడైనా చూశారా!: వీడియో
Cricket: ఇంత భారీ నోబాల్ ఎప్పుడైనా చూశారా!: వీడియో

Cricket: అబుదాబి టీ10 లీగ్‍లో మరో అరుదైన విషయం జరిగింది. ఈ టోర్నీలో నార్తెర్న్ వారియర్స్ జట్టు తరఫున ఆడుతున్న భారత ప్లేయర్ అభిమన్యు మిథున్ ఓ భారీ నోబాల్ వేశాడు. చెన్నై బ్రేవ్స్ జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‍లో ఇది జరిగింది. ఇంత భారీ నోబాల్‍కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

107 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై బ్రేవ్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. 5వ ఓవర్లో వారియర్స్ బౌలర్ అభిమన్యు మిథున్ ఈ నోబాల్ వేశాడు. రనప్ పూర్తి చేసి బౌలింగ్ క్రీజును దాటి చాలా దూరంలో కాలిని ల్యాండ్ చేశాడు. భారీ నోబాల్ వేశాడు. భనుక రాజపక్సెను ఔట్ చేశాక.. మిథున్ ఈ నోబాల్ వేశాడు.

మిథున్ భారీ నోబాల్‍కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ నోబాల్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫిక్సింగ్ వల్లే అంత భారీ నోబాల్ వేశాడంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఇంత భారీ నోబాల్ తాము ఎప్పుడూ చూడలేదని, కావాలనే వేసినట్టు ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మహమ్మద్ అమిర్ నో బాల్ కంటే ఇదే ఎక్కువగా ఉందని మరికొందరు పోలుస్తున్నారు. మొత్తంగా ఈ నోబాల్.. అబుదాబి టీ10 లీగ్‍పై వివాదాన్ని రేకెత్తిస్తోంది.

ఇక, ఈ మ్యాచ్‍లో చెన్నై బ్రేవ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో నార్తెర్న్ వారియర్స్ టీమ్‍పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన వారియర్స్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 106 పరుగులు చేసింది. 9.4 ఓవర్లలో 5 వికెట్లకు 107 రన్స్ చేసి చెన్నై బ్రేవ్స్ గెలిచింది.

WhatsApp channel