YSRHU Admissions: వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీలో MSc, Phd ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్
YSRHU Admissions: ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ హార్టికల్చర్, పిహెచ్‌డి హార్టికల్చర్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
YSRHU Admissions: తాడేపల్లి గూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ హార్టికల్చర్, పిహెచ్‌డి హార్టికల్చర్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. https://drysrhu.ap.gov.in/home.html లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.
ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్శిటీలో ఎమ్మెస్సీ హార్టికల్చర్, పీహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసే అభ‌్యర్థులు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారై ఉండాలి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ICAR AIEEA(PG) 2024, ICAR AICE JRF/SRF(Phd)2024లో క్వాలిఫై అయ్యుండాలి. పూర్తి వివరాలు యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ఎమ్మెస్సీ హార్టికల్చర్...
ఎమ్మెస్సీ హార్టికల్చర్ రెండేళ్ల పీజీ కోర్సుగా నిర్వహిస్తారు. ఇందులో ఫ్రూట్ సైన్స్, వెజిటేబుల్ సైన్స్, ఫ్లోరీ కల్చర్, లాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్- స్పైసెస్- మెడిసినల్ అండ్ అరోమటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో రెగ్యులర్ కోర్సులను అందిస్తారు.
ఫ్రూట్ సైన్స్ విభాగంలో మొత్తం 9సీట్లు, వెజిటేబుల్ సైన్స్ లో 11సీట్లు, ఫ్లోర్‌కల్చర్ అండ్ లాండ్ స్కేపింగ్‌లో 8 సీట్లు, ప్లాంటేషన్- స్పైసెస్- మెడిసినల్ అండ్ అరోమటిక్ క్రాప్స్‌లో 6 సీట్లు, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో 6 సీట్లు ఉన్నాయి. ప్రతి కోర్సులో స్టైఫెండ్, నాన్ స్టైఫెండ్ సీట్లు ఉంటాయి. ఏ క్యాటగిరీలో మొత్తం హార్టికల్చర్‌లో 40సీట్లు ఉంటాయి.
సీట్ల కేటాయింపులో ఈడబ్ల్యూఎస్‌లో కోటాలో 4సీట్లు, ఐకార్ జేఆర్‌ఎఫ్-నాన్ జేఆర్‌ఎఫ్ సీట్లు 12, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 4సీట్లు, ఇన్ సర్వీస్ హార్టికల్చర్ ఆఫీసర్ 1సీటు, ఇండో ఆఫ్ఘనిస్తాన్ నాన్ ఆఫ్రికన్ ఫెలోషిప 2సీట్లు, ఐసీసీఆర్ స్కాలర్‌షిప్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కోటాలో 2సీట్లు ఉంటాయి. బి క్యాటగిరీలో 25సీట్లు ఉంటాయి. పీజీలో మొత్తం 65 సీట్లు ఉంటాయి. వెంకటరామన్న గూడెం హార్టికల్చర్ కాలేజీలో 24సీట్లు, అనంతరాజుపేటలో 16సీట్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో 25సీట్లు ఉన్నాయి.
పీహెచ్‌డీ కోర్సులు..
పీహెచ్‌డీ కోర్సులో ఫ్రూట్ సైన్స్, వెజిటేబుల్ సైన్స్, ఫ్లోర్ కల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్-స్పైసేస్ మెడిసినల్ అండ్ అరోమటిక్ క్రాప్స్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు ఉన్నాయి.