AP Jails Recruitment: జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్ట్ లకు మార్చి 2న వ్రాత పరీక్ష, రెండు క్యాటగిరీల్లో పరీక్షలు
AP Jails Recruitment: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో డ్రైవర్ ఉద్యోగ నియామకాలకు పరీక్షను మార్చి 2వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు.
AP Jails Recruitment: జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్ట్‌ల భర్తీలో భాగంగా అభ్యర్థులకు మార్చి 2వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. జైళ్ల శాఖ డ్రైవర్ పోస్ట్‌ల పరీక్షలపై జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్ట్ లకు గాను గతంలో నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొని అర్హత సాధించిన 311 మందికి ఈ ఏడాది మార్చి 2న వ్రాత పరీక్షను నిర్వహిస్తారు.
నెల్లూరు జిల్లా మూలపేట లోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమి ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్(APSTARS), పాత సెంట్రల్ జైల్ ఆవరణలో నిర్వహించనున్నామని తెలిపారు. లైట్ మోటర్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఉదయం 8గంటలకు, హెవీ మోటర్ వెహికల్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మధ్యాహ్నం 12గంటలకు పరీక్షా కేంద్రానికి హజరుకావాల్సి ఉంటుంది.
నిర్దేశించిన సమయానికి హజరుకాని అభ్యర్థులను పరీక్షా ప్రాంగణంలోకి అనుమతించరని డీజీ తెలిపారు. మరింత సమాచారం కోసం https://spsnellore.ap.gov.in/prisons-department/ వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.