రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17 నుంచి 31 మధ్య పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సంవత్సరం 6.5 లక్షలకు పైగా విద్యార్థులు బోర్డు పరీక్షలు రాశారు. ఇంటర్‌లో అడ్మిషన్ల కోసం పదో తరగతి ఫలితాలు కీలకం. అందుకే విద్యార్థులు, వారి పేరెంట్స్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అటు బోర్డు అధికారులు కూడా ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల విడుదలపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఫలితాలు విడుదల అయ్యాక.. అధికారిక వెబ్‌సైట్ bseaps.in ద్వారా తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నా దీని ద్వారా బోర్డు దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఏపీ ఎస్సెస్సీ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పరీక్ష పేరు- ఆంధ్రప్రదేశ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష 2025
బోర్డు- సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు, ఆంధ్రప్రదేశ్
ఫలితం పేరు- ఏపీ ఎస్సెస్సీ ఫలితాలు 2025
అధికారిక వెబ్‌సైట్- bse.ap.gov.in
ఫలితాల విడుదల - ఏప్రిల్ 2025 (అంచనా)
ఫలితాల ప్రకటన మోడ్- ఆన్‌లైన్, ఎస్ఎంఎస్, డిజిలాకర్
ఫలితాల కోసం కావాల్సింది- రోల్ నంబర్
1.అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in ను ఓపెన్ చేయాలి.
2.పదో తరగతి పరీక్షా ఫలితాల ట్యాబ్‌ను ఎంచుకోవాలి.
3.సూచించిన కాలంలో రోల్ నంబర్ ఎంటర్ చేయాలి.
4.స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
5.భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూడలేకపోతే.. ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
మీ మొబైల్‌లో ఎస్ఎంఎస్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
పదో తరగతి రోల్ నంబర్‌ను నమోదు చేయాలి.
55352 నంబర్‌కు సందేశం పంపాలి.
వెంటనే మొబైల్‌కు ఫలితాలు వస్తాయి.
దాన్ని డిలీట్ చేయకుండా ఉంటే మంచిది.
రోల్ నంబర్
విద్యార్థుల పేరు
జిల్లా పేరు
సబ్జెక్టులు (మూడు భాషలు, మూడు ఇతర సబ్జెక్టులు)
ఇంటర్నల్ మార్కులు
సగటు గ్రేడ్ పాయింట్
గ్రేడ్ పాయింట్లు
క్వాలిఫైయింగ్ స్టేటస్ (ఉత్తీర్ణత/ఫెయిల్)
గతేడాది 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 89.17 శాతం అమ్మాయిలు పాస్ అయ్యారు. 84.32 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. 69.26 శాతం మంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్‌లో పాసయ్యారు. 11.87 శాతం మంది సెకెండ్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు. 5.6 శాతం మంది విద్యార్థులు థర్డ్ డివిజన్‌లో పాసయ్యారు.
సంబంధిత కథనం