తెలుగు న్యూస్ / career /
TGPSC Groups Results : ఆ తర్వాతనే గ్రూప్ 3, 2 ఫలితాలు..! ముఖ్యమైన కారణాలు
TGPSC Group Exams Results : ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ దృష్టి పెట్టింది. రాత పరీక్షలతో పాటు ఫలితాల విడుదలను వేగవంతం చేయాలని చూస్తోంది. కీలకమైన గ్రూప్ 1, 3 పరీక్షలను కూడా పూర్తి చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫలితాలను ఇవ్వాలని భావిస్తోంది.
తెలంగాణ గ్రూప్స్ పరీక్షల ఫలితాలు
గ్రూప్స్ పరీక్షల ఫలితాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టి పెట్టింది. ఇటీవలేనే గ్రూప్ 4 ప్రక్రియను పూర్తి చేసింది. మరోవైపు అత్యంక కీలకమైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను కూడా నిర్వహించింది. ఇక గ్రూప్ 3 పరీక్షలను కూడా పూర్తి చేసింది. ఇక ఈ నెలలోనే గ్రూప్ 2 రాత పరీక్షలను సిద్ధమైంది.
గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. గత నెలలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా ప్రారంభించింది. మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది. అయితే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా పరీక్షల తుది ఫలితాలను ఇవ్వాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమైన కారణాలు :
- గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాతనే గ్రూప్ 3, గ్రూప్ 2 ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
- గ్రూప్ 1 ఫలితాలు కాకుండా గ్రూప్ 3, 2 ఫలితాలను ప్రకటిస్తే కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంటుందని టీజీపీఎస్సీ భావిస్తోంది.
- ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇటీవలే గురుకుల నియామాకాల్లో కూడా ఇదే జరిగింది.
- ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం జరుగుతోంది. గత నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
- పరీక్షల మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది.
- ఇదంతా కూడా పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. తుది ఫలితాలను ఫిబ్రవరి మాసంలో ప్రకటించాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది.
- గ్రూప్ 1 తుది ఫలితాలను ఫిబ్రవరి 20వ తేదీలోపే ప్రకటించే అవకాశం ఉంది.
- ఇక గ్రూప్ 3 పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రాథమిక కీలను ప్రకటించనున్నారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
- మరోవైపు డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాల ప్రకటనకు కూడా సమయం పడుతుంది.
- మొత్తంగా గ్రూప్ 1 ఫలితాల వెల్లడి తర్వాతే… గ్రూప్ 2, 3 ఫలితాలు కూడా ప్రకటించనున్నారు.
సంబంధిత కథనం