Education loan: ఉన్నత విద్య ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా, భరించలేని ఖర్చుగా మారింది. ఉన్నత విద్య అంటే ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. అయితే, విద్యార్థులు ఈ ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా వారి లక్ష్యాలను చేరుకోవడానికి విద్యా రుణాలు ఉపయోగపడ్తాయి. అయితే, ఎడ్యుకేషన్ లోన్ ను సరిగ్గా అర్థం చేసుకోవడం, సరిగ్గా నిర్వహించడం చాలా అవసరం.
విద్యా రుణం అనేది ఒక విద్యార్థి తన విద్యకు నిధులు సమకూర్చడంలో సహాయపడటానికి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అందించే ఆర్థిక సహాయం. ఈ రుణాలన్నీ ట్యూషన్ ఫీజులు, బోర్డింగ్ ఛార్జీలు, ప్రయాణం, విద్యార్థి తన చదువు సమయంలో చేసే ఏదైనా ఇతర ఖర్చులను కవర్ చేస్తాయి. ఇందులోని ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్, మారటోరియం పీరియడ్ కారణంగా, విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టవచ్చు. వారు తమ కోర్సును పూర్తి చేసి ఉపాధి పొందిన తర్వాతనే దానిని తిరిగి చెల్లించడం ప్రారంభించవచ్చు.
విద్యా రుణం తీసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్ వివిధ బ్యాంకులు, లేదా ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లను పరిశీలించండి. లోన్ మొత్తం, లోన్ పై వడ్డీ రేటు, ఇతర ఛార్జీలు, మారటోరియం పీరియడ్, ఈఎంఐ ఆప్షన్స్.. మొదలైన వాటిని పరిశీలించండి. రుణం తీసుకునేముందు, మీ రీపేమెంట్ స్థాయిని పరిశీలించుకోండి. రుణ నిబంధనలను అర్థం చేసుకోండి. అవసరమైతే, నిపుణులను సంప్రదించండి.
(గమనిక: రుణం తీసుకోవడంలో కొన్ని రిస్క్ లు కూడా ఉంటాయి. కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది)