విద్యార్థుల్లారా.... అడ్మిషన్లకు వేళాయే...! ఈ సర్టిఫికెట్లను ముందుగానే పొందండి-what are the documents required for admission to educational institutions key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  విద్యార్థుల్లారా.... అడ్మిషన్లకు వేళాయే...! ఈ సర్టిఫికెట్లను ముందుగానే పొందండి

విద్యార్థుల్లారా.... అడ్మిషన్లకు వేళాయే...! ఈ సర్టిఫికెట్లను ముందుగానే పొందండి

కొత్త విద్యా సంవత్సరం షురూ కానుంది. ఇంటర్ నుంచి పీజీ వరకు అనేక రకాల కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతుంటాయి. ఇందుకోసం కొన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. కొన్ని ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ - ముఖ్యమైన వివరాలు

కొన్ని రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావాలంటే… ప్రతి విద్యార్థి వద్ద కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉండాల్సిందే. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రులు గాబరపడిపోతుంటారు. మండల కేంద్రాలు, మీ-సేవా సెంటర్ల వద్దకు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ముందస్తుగానే వీటి విషయంలో ఓ అవగాహన ఉంటే ఇబ్బందులు లేకుండా ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్యమైన పత్రాలు….

ప్రవేశ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు బోనాఫైడ్ సర్టిఫికెట్‌, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ (TC), కుల ధ్రువీకరణపత్రం, ఆదాయ సర్టిఫికెట్‌, నివాస ధ్రువపత్రం వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కాలర్‌షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి ప్రయోజనాలు పొందాలంటే ఈ డాక్యుమెంట్లు మరింత కీలకం అవుతాయి.

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. వీటిని మీసేవా ద్వారా పొందవచ్చు. కుల ధ్రువీకరణ పత్రం కోసం అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, తండ్రి/తల్లి యొక్క కుల ధ్రువపత్రం, విద్యా సంస్థ నుంచి బోనాఫైడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. నిర్ణీత రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేసి కుల ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. మీసేవా ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ఇదే మాదిరిగా ప్రాసెస్ ఉంటుంది. అదనంగా గత ఏడాది ఆదాయ వివరాలు పేర్కొనాలి.

నివాస ధ్రువపత్రం (Residence Certificate) కోసం ఆధార్ కార్డు, ఇంటి అద్దె ఒప్పందం / ఇంటి యజమాని అర్బన్ పాస్‌బుక్ / గృహ పన్ను రశీదు, విద్యార్థుల బోనఫైడ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇవే కాకుండా ఇతర అవసరమైన పత్రాలను కూడా మీసేవా కేంద్రాల నుంచి పొందవచ్చు. అయితే గ్యాప్ సర్టిఫికెట్ వంటి విషయాల్లో ఇబ్బందులుగానీ ఇతర విషయాల్లో సమస్యలు ఉంటే నేరుగా మండల రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ధ్రవపత్రాల విషయంలో అలర్ట్ గా ఉండటం మంచిది. విద్యార్థుల భవిష్యత్‌ కోసం ఎలాంటి జాప్యం లేకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకుంటే ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. ప్రవేశాల ప్రక్రియ సాఫీగా జరిగిపోతుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.