BRAOU BEd Counseling : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - అందుబాటులోకి వెబ్ ఆప్షన్లు, 15న సీట్ల కేటాయింపు..!
BRAOU BEd Counseling Updates :హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫిబ్రవరి 15వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ(ODL -Open and Distance Learning) కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఇందుకు సంబంధించి వెబ్ ఆప్షన్లు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. నిర్ణయించిన ఫీజు చెల్లించి… అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత… వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 9లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఫిబ్రవరి 15వ తేదీన సీట్లు కేటాయింపు….
ఇక ఫిబ్రవరి 10వ తేదీన ఎడిట్ వెబ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి మాత్రమే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. స్పెషల్ కేటగిరి అభ్యర్థుల ధ్రువపత్రాలను ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పరిశీలిస్తారు. ఫిబ్రవరి 15వ తేదీన సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను(ఫేజ్ 1) ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఫిబ్రవరి 17 నుంచి 19 తేదీలోపు యూనివర్శిటీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఈ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-23680291/289/491/432/607, 9154114978 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 అకడమిక్ ఇయర్ కు సంబంధించి బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు అంబేడ్కర్ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం