వరంగల్ 'నిట్'లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్య వివరాలివే-warangal nit issued a notification for the recruitment of contract jobs details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  వరంగల్ 'నిట్'లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్య వివరాలివే

వరంగల్ 'నిట్'లో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్య వివరాలివే

వరంగల్ లోని నిట్ క్యాంపస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. జూలై 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వరంగల్ నిట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఐదు ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు… జూలై 9వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

వరంగల్ ‘నిట్’ ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు

  • ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్, తెలంగాణ రాష్ట్రం
  • మొత్తం ఖాళీలు - 05
  • ఖాళీల వివరాలు : విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) -1, విజిటింగ్ కన్సల్టెంట్(ఆర్కిటెక్ట్) -01, పుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ - 1, స్టూడెంట్ కౌన్సెలర్‌ -1, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 1
  • ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు. ఏడాది కాలానికి పని చేయాలని. పని తీరును బట్టి… రెన్యూవల్ పై నిర్ణయం తీసుకుంటారు.
  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా…ఆయా రంగంలో పని చేసిన అనుభవం ఉండాలి.
  • లీగల్ అడ్వజైర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వాళ్లు…. బార్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 3 ఏళ్లుగా అడ్వొకెట్ గా పని చేసి ఉండాలి.
  • ఎంపికైన వారికి నెలకు విజిటింగ్ కన్సల్టెంట్‌కు రూ.50,000, పుడ్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సెలర్‌, పీఆర్‌ఓకు రూ.60,000 జీతం చెల్లిస్తారు.
  • అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జూలై 09వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
  • ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలపై అభ్యర్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే పరీక్ష కూడా నిర్వహించవచ్చు.
  • అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/
  • సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు - 0870-2459191, 2459366
  • ఈమెయిల్: registrar@nitw.ac.in

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.