NIT Warangal Recruitment 2025 : వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..!-warangal nit has issued a recruitment notification for filling up 6 non teaching posts ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Nit Warangal Recruitment 2025 : వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..!

NIT Warangal Recruitment 2025 : వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 18, 2025 06:17 AM IST

NIT Warangal Recruitment 2025 : వరంగల్ నిట్ నుంచి ఉద్యోగ రిక్రూట్ మెంట్ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా... ఆరు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారు ఫిబ్రవరి 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు
వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు

నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి వరంగల్‌లోని ‘నిట్’(NIT) ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మొత్తం 6 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్ చేయనున్నారు.ఎంపికైన వారు ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

yearly horoscope entry point

దరఖాస్తు విధానం….

ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఫిబ్రవరి 7, 2025వ తేదీతో అప్లికేషన్ గడువు పూర్తి అవుతుంది. రాత్రి 11.59 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవాలి. https://nitw.ac.in/Careers/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ చేయవచ్చు. ఇక సాంకేతిక సమస్యలు ఉంటే recruit@nitw.ac.in మెయిల్ ను సంప్రదించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. .ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - నిట్ వరంగల్,
  • మొత్తం ఖాళీలు - 06
  • ఖాళీల వివరాలు : విజిటింగ్‌ కన్సల్టెంట్‌ (లీగల్‌ అడ్వైజర్‌)- 01, ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్ - 1, విజిటింగ్‌ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్‌ - 01, ట్రైనింగ్ అండ్‌ ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌ - 01, స్టూడెంట్ కౌన్సెలర్‌ - 01,. పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ -1
  • ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 07, 2025.
  • ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
  • ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచారు
  • అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/

Whats_app_banner

సంబంధిత కథనం