ISRO internship 2025 : ఇస్రోలో ఇంటర్న్​షిప్​కి సువర్ణావకాశం- పూర్తి వివరాలు ఇవే..-want to be an intern at isro check eligibility duration stipend where to apply other details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Isro Internship 2025 : ఇస్రోలో ఇంటర్న్​షిప్​కి సువర్ణావకాశం- పూర్తి వివరాలు ఇవే..

ISRO internship 2025 : ఇస్రోలో ఇంటర్న్​షిప్​కి సువర్ణావకాశం- పూర్తి వివరాలు ఇవే..

Sharath Chitturi HT Telugu
Jan 25, 2025 07:20 AM IST

ISRO internship 2025 : ఇస్రోలో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు అలర్ట్​! ఇస్రో ఇంటర్న్​షిప్​ 2025 ద్వారా మీకు సువర్ణావకాశం లభించనుంది. ఈ ఇంటర్న్​షిప్​ అర్హత, డ్యురేషన్​, స్టైఫండ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇస్రోలో ఇంటర్న్​షిప్​కి సువర్ణావకాశం
ఇస్రోలో ఇంటర్న్​షిప్​కి సువర్ణావకాశం

ఇస్రో లాంటి సంస్థతో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అందించే ఇంటర్న్​షిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది! వివిధ విద్యార్హతలు ఉన్న విద్యార్థులకు ఇంటర్న్​షిప్​ అవకాశాలు, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్​ని ఇస్రో అందిస్తోంది. ఇంజినీర్లు, డిప్లొమా హోల్డర్లు, మాస్టర్స్, డాక్టరేట్ అభ్యర్థులు ఇస్రో ఇంటర్న్​షిప్​ 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూడండి.

ఇస్రో ఇంటర్న్​షిప్​ 2025..

ఇంటర్న్​షిప్​కి అర్హతలు: ఈ ఇంటర్న్​షిప్​ స్కీమ్​కి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ (ఇండియా/ విదేశాలు) నుంచి సైన్స్ లేదా టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ చదువుతున్న యూజీ/ పీజీ/ పీహెచ్డీ విద్యార్థులు (సిటిజన్స్ ఆఫ్ ఇండియా) పొందవచ్చు లేదా దరఖాస్తు చేసిన ఆరు నెలలలోపు చదువును పూర్తి చేసి ఉండొచ్చు.

ఈ ఇస్రో ఇంటర్న్​షిప్​ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థి కనీసం 60% లేదా 10 స్కేల్​పై 6.32 సీజీపీఏ కలిగి ఉండాలి.

స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్ కోసం: ఇంజినీరింగ్ (బీఈ / బీటెక్) డిగ్రీ కోసం, ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్​కి దరఖాస్తు చేయడానికి విద్యార్థి 6వ సెమిస్టర్ పూర్తి చేసి ఉండాలి. ఎంఈ / ఎంటెక్ కోసం, దరఖాస్తు చేయడానికి విద్యార్థి మొదటి సెమిస్టర్ పూర్తి చేసి ఉండాలి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు బీఎస్సీ/డిప్లొమా చివరి సంవత్సరం చదివి ఉండాలి. ఎమ్మెస్సీ అభ్యర్థులు మొదటి సెమిస్టర్, పీహెచ్​డీ అభ్యర్థులు కోర్సు వర్క్ పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్​కి అప్లై చేసి ఉండాలి.

ఇంటర్న్​షిప్​ వ్యవధి..

ఇస్రో ఇంటర్న్​షిప్​ స్కీమ్ గరిష్టంగా 45 రోజులు ఉంటుంది.

స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్: ఇంజినీరింగ్, బీఎస్సీ/ డిప్లొమా విద్యార్థులకు ప్రాజెక్ట్ ట్రైనీ వ్యవధి కనీసం 45 రోజులు, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీలకు కనీసం 120 రోజులు, పీహెచ్​డీ కనీసం 30 నెలలు.

స్టైఫండ్..

ఇంటర్న్​లు లేదా ప్రాజెక్ట్ ట్రైనీలు ఎలాంటి స్టైపెండ్/ రెమ్యూనరేషన్/ ఆర్థిక సహాయానికి అర్హులు కాదు.

ఇతర సమాచారం..

సంబంధిత కేంద్రం/యూనిట్​లో నిర్వహించే పనికి నైపుణ్యం, ప్రాజెక్టులు, సౌకర్యాలు, విద్యార్థి కోర్సు అనుకూలత ఆధారంగా ఇంటర్న్​షిప్ / ప్రాజెక్ట్ వర్క్ కేటాయించడం జరుగుతుంది.

ప్రాజెక్ట్ ట్రైనీలు లేదా ఇంటర్న్​లు వారి ప్రాజెక్ట్ / ఇంటర్న్​షిప్​ సంతృప్తికరంగా పూర్తయిన తర్వాత, వారి అసైన్మెంట్ నివేదికను సమర్పించిన తర్వాత, సంబంధిత డివిజన్ అధిపతుల మూల్యాంకనం అనంతరం సర్టిఫికేట్లను ప్రదానం చేస్తారు.

ఇంటర్న్​షిప్​ లేదా ప్రాజెక్ట్ స్కీమ్​కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు isro.gov.in ఇస్రో అధికారిక వెబ్సైట్​ని సందర్శించాలి. ఇంటర్న్​షిప్​ నిర్వహించే సెంటర్/యూనిట్ వెబ్సైట్ల జాబితాను అధికారిక వెబ్సైట్​లో పొందుపరిచారు. అభ్యర్థులు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇస్రో అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం