Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో డీసీహెచ్ హాస్పిటల్‌లో 29 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన తేదీలివిగో-vizianagaram dch hospital announces 29 job openings check important dates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో డీసీహెచ్ హాస్పిటల్‌లో 29 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన తేదీలివిగో

Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో డీసీహెచ్ హాస్పిటల్‌లో 29 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన తేదీలివిగో

HT Telugu Desk HT Telugu

Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 29 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ మార్చి 21గా నిర్ణయించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప‌ద్ధతుల్లో భ‌ర్తీ చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో డీసీహెచ్ హాస్పిటల్‌లో 29 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల, ముఖ్యమైన తేదీలివిగో

Vizianagaram Jobs : విజయనగరం జిల్లాలో మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప‌రిధిలో డీసీహెచ్ హాస్పిట‌ల్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లుకు ఆఖ‌రు తేదీ మార్చి 21గా నిర్ణయించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప‌ద్దతుల్లో భ‌ర్తీ చేస్తున్నారు.

పోస్టులు ఎన్ని?

మొత్తం 29 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్‌-1, ల్యాబ్ టెక్నిషియ‌న్ -2, ఆడియోమెట్రిషియన్-4, రేడియోగ్రాఫ‌ర్‌-1, ఫిజియోథెరపిస్ట్-2, ఎల‌క్ట్రీష‌య‌న్ -1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో బయో స్టాటిస్టిషియన్-1, థియేట‌ర్ అసిస్టెంట్-3, మెడిక‌ల్ రికార్డ్ అసిస్టెంట్‌, రికార్డ్ అసిస్టెంట్‌-1, ల్యాబ్ అటెండంట్‌-2, జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) -10, ప్లంబ‌ర్ -1 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

నెలవారీ వేతనం

1. బ‌యో మెడిక‌ల్ ఇంజ‌నీర్ - రూ.54,060

2. రేడియోగ్రాఫ‌ర్ - రూ.35,570

3. ఫిజియోథెరపిస్ట్ - రూ.35,570

4. ల్యాబ్ టెక్నిషియ‌న్ - రూ.32,670

5. ఆడియోమెట్రిషియన్ - రూ.32,670

6. ఎలక్ట్రీషియన్ - రూ.22,460

7. బయో స్టాటిస్టిషియన్- 18,500

8. థియేట‌ర్ అసిస్టెంట్‌- రూ.15,000

9. మెడిక‌ల్ రికార్డ్ అసిస్టెంట్‌, రికార్డ్ అసిస్టెంట్ - రూ.15,000

10. ల్యాబ్ అటెండంట్ - రూ.15,000

11. జనరల్ డ్యూటీ అటెండంట్ (జీడీఏ) - రూ.15,000

12. ప్లంబ‌ర్ - రూ.15,000

అర్హత‌లు

అర్హత‌లు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్‌, గ్రాడ్యుష‌న్, బీటెక్‌ త‌దిత‌ర అర్హత‌లు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

1. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు ఆఖ‌రు తేది : మార్చి 21

2. మెరిట్ లిస్ట్ విడుద‌ల, అభ్యంత‌రాలు స్వీక‌ర‌ణ : ఏప్రిల్ 4

4. అభ్యంత‌రాలు చేసేందుకు గ‌డువు : ఏప్రిల్ 8

5. ప్రొవిజ‌న‌ల్ మెరిట్ లిస్టు విడుద‌ల : ఏప్రిల్ 17

6. అభ్యంత‌రాలు తెలిపేందుకు : ఏప్రిల్ 19

7. తుది మెరిట్ లిస్ట్ విడుద‌ల : ఏప్రిల్ 24

వ‌యో ప‌రిమితి

2025 జ‌న‌వ‌రి 1 నాటికి వ‌య‌స్సు 42 ఏళ్లలోపు మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్యర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వ‌య‌స్సు దాట‌కూడ‌దు.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు ఓసీ అభ్యర్థుల‌కు రూ.250 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగు అభ్యర్థుల‌కు అప్లికేష‌న్ ఫీజు మిన‌హాయింపు. ఫీజును favor of District Coordinator of Hospital Services, Vizianagaram కి డీడీ తీయాలి. ఆ డీడీని అప్లికేష‌న్‌కు జ‌త‌చేయాలి.

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి?

ద‌ర‌ఖాస్తు ఫార‌మ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2025/03/2025031281.pdf అందుబాటులో ఉంటుంది. అక్క‌డ నుంచి ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుతో పాటు విద్యార్హ‌త‌లు, ఉద్యోగ అనుభ‌వాలతో కూడిన జెరాక్స్ కాపీ సెట్‌ను office of the District Coordinator of Hospital Services (DCHS,), Govt. General Hospital, Cantonment, Vizianagaram కు మార్చి 21 తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

అద‌న‌పు వివ‌రాలు (పోస్టుల వారీగా అర్హత‌లు, రిజ‌ర్వేష‌న్లు త‌దిత‌ర అంశాలు)కు అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2025/03/2025031281.pdf సంప్ర‌దిచాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం