Vizag Steel Plant Apprentice : వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 అప్రెంటిస్ పోస్టులు, రాత పరీక్ష లేకుండానే భర్తీ-vizag steel plant apprenticeship 250 vacancies eligibility application process important dates ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Vizag Steel Plant Apprentice : వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 అప్రెంటిస్ పోస్టులు, రాత పరీక్ష లేకుండానే భర్తీ

Vizag Steel Plant Apprentice : వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 అప్రెంటిస్ పోస్టులు, రాత పరీక్ష లేకుండానే భర్తీ

Bandaru Satyaprasad HT Telugu
Dec 25, 2024 08:12 PM IST

Vizag Steel Plant Apprentice : వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 9లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 అప్రెంటిస్ పోస్టులు, రాత పరీక్ష లేకుండానే భర్తీ
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 250 అప్రెంటిస్ పోస్టులు, రాత పరీక్ష లేకుండానే భర్తీ

Vizag Steel Plant Apprentice : రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. ఇంజినీరింగ్, డిప్లొమా పాసైన అభ్యర్థులు (2022/2023/2024 ఉత్తీర్ణులు మాత్రమే) జనవరి 9లోగా దరఖాస్తులను చేసుకోవాలి. మొత్తం 250 అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్లు ఆహ్వానించారు.

yearly horoscope entry point

ఖాళీలు -250

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీలు - 200
  • టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీలు -50

అర్హతలు

  • ఇంజినీరింగ్(B.E. / B.TECH) ట్రైనీలు - మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ /
  • ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్
  • డిప్లొమా - మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మైనింగ్, కెమికల్, మెటలర్జీ
  • అప్రెంటిస్‌షిప్ శిక్షణ కాలం ఒక సంవత్సరం. అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తయిన తర్వాత రిలీవ్ చేస్తారు. అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తయిన తర్వాత ఏదైనా ఉద్యోగాన్ని కల్పించడం స్టీల్ ప్లాంట్ పక్షాన తప్పనిసరి కాదు.

స్టైపెండ్

  • ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు (GAT) నెలకు రూ.9,000 స్టైపెండ్
  • డిప్లొమా ఇంజినీరింగ్ (TAT) నెలకు రూ.8,000/- స్టైపెండ్.

స్టైపెండ్‌ను రెండు భాగాలుగా చెల్లిస్తారు. 50% అప్రెంటిస్‌షిప్ శిక్షణ బోర్డు ద్వారా చెల్లిస్తారు. మిగిలిన 50% స్టీల్ ప్లాంట్ ద్వారా చెల్లిస్తారు. అభ్యర్థులు ప్రభుత్వ వాటా స్టైపెండ్‌ను పొందడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) కోసం ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. అభ్యర్థులు 9 జనవరి 2025 లోపు గూగుల్ ఫారమ్ సర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు NATS 2.0 పోర్టల్ (https://nats.education.gov.in)లో ముందుగా నమోదు చేసుకోవాలి. గతంలో అప్రెంటిస్‌షిప్ పొందిన లేదా ప్రస్తుతం అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, వేరే చోట ఉద్యోగంలో ఉన్నవారు, ఇతర చోట్ల అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

అర్హత కలిగిన అభ్యర్థులను సంబంధిత రిజర్వేషన్, ఉత్తీర్ణ పరీక్షల్లో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. NATS 2.0 పోర్టల్‌లో బయో-డేటా ఫారమ్/ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి సమాచారం అందిస్తారు. ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు RINL- విశాఖపట్నంలోని ప్లాంట్ తో పాటు ఇతర యూనిట్లలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Whats_app_banner

టాపిక్