Vizag Port Jobs : విశాఖ‌ప‌ట్నం పోర్టులో 24 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల, పూర్తి వివ‌రాలివే-visakhapatnam port notification 24 posts available application process important details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Vizag Port Jobs : విశాఖ‌ప‌ట్నం పోర్టులో 24 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల, పూర్తి వివ‌రాలివే

Vizag Port Jobs : విశాఖ‌ప‌ట్నం పోర్టులో 24 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల, పూర్తి వివ‌రాలివే

Vizag Port Jobs : విశాఖపట్నం పోర్టులో వివిధ కేటగిరీల్లో 24 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌ https://vpt.shipping.gov.in/ లోని కెరీర్‌లో పూర్తి వివ‌రాలు తెలిపారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు.

విశాఖ‌ప‌ట్నం పోర్టులో 24 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ విడుదల, పూర్తి వివ‌రాలివే

Vizag Port Jobs : విశాఖ‌ప‌ట్నం పోర్టులో వివిధ కేట‌గిరీల్లో పోస్టుల భ‌ర్తీ నోటిఫికేషన్ విడుద‌ల అయింది. ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తులు కొన్ని పోస్టుల‌కు ఆఫ్‌లైన్‌లోనూ, కొన్ని పోస్టుల‌కు ఆన్‌లైన్‌లోనూ చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు కూడా ఆఖ‌రు తేదీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి.

పోస్టులు

మొత్తం 24 పోస్టులను భ‌ర్తీ చేస్తారు. ఇందులో నాలుగు విభాగాల్లో చీఫ్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్, మేనేజ‌ర్ పోస్టులు 16, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ (సివిల్‌) పోస్టులు మూడు, చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టు 1, ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టు 1, సీనియ‌ర్ మెరైన్ ఇంజ‌నీర్ పోస్టు -1, మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు-1, బిజినెస్ ప్ర‌మోష‌న్ క‌న్స‌లెంట్ పోస్టు 1 భ‌ర్తీ చేస్తున్నారు.

1. ఇన్ఫ‌ర్మేష‌న్, క‌మ్యూనికేష‌న్ అండ్ టెక్నాల‌జీ విభాగంలో సీనియ‌ర్ మేనేజ‌ర్ -1, మేనేజ‌ర్ -3 పోస్టులు

2. కార్పొరేట్ లీగ‌ల్ విభాగంలో చీఫ్ మేనేజ‌ర్ -1, సీనియ‌ర్ మేనేజ‌ర్ -1, మేనేజ‌ర్ -2 పోస్టులు

3. ఇన్విరాన్‌మెంట్ ప్లానింగ్ అండ్ సేఫ్టీ విభాగంలో చీఫ్ మేనేజ‌ర్ (ఇన్విరాన్‌మెంట్) -1, సీనియ‌ర్ మేనేజ‌ర్ (సేఫ్టీ) -1, మేనేజ‌ర్ (ఇన్విరాన్‌మెంట్)-2 పోస్టులు

4. బిజినెస్ డ‌వ‌లప్‌మెంట్ అండ్ ట్రేడ్ ప్రొమోష‌న్ విభాగంలో చీఫ్ మేనేజ‌ర్ -1, సీనియ‌ర్ మేనేజ‌ర్ -1, మేనేజ‌ర్ -2 పోస్టులు

5. డిప్యూటీ చీఫ్ ఇంజ‌నీర్ (సివిల్‌) పోస్టులు -3

6. చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టు- 1

7. ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టు- 1

8. సీనియ‌ర్ మెరైన్ ఇంజ‌నీర్‌-1

9. మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-1

10. బిజినెస్ ప్ర‌మోష‌న్ క‌న్స‌లెంట్ పోస్టు -1

జీతాలు

1. చీఫ్ మేనేజ‌ర్ పోస్టుల‌కు నెల‌కు రూ.2,00,000

2. సీనియ‌ర్ మేనేజ‌ర్ పోస్టుల‌కు నెల‌కు రూ.1,60,000

3. మేనేజ‌ర్ పోస్టులకు నెల‌కు రూ.1,20,000

4. డిప్యూటీ చీఫ్ ఇంజ‌నీర్ (సివిల్‌) పోస్టులకు నెల‌కు రూ.80,000 నుంచి రూ.2,20,000 వ‌ర‌కు ఉంటుంది.

5. చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుకు నెల‌కు రూ.80,000 నుంచి రూ.2,20,000 వ‌ర‌కు ఉంటుంది.

6. ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టుకు నెల‌కు రూ.1,00,000 నుంచి రూ.2,60,000 వ‌ర‌కు ఉంటుంది.

7. సీనియ‌ర్ మెరైన్ ఇంజ‌నీర్ పోస్టుకు నెల‌కు రూ.80,000 నుంచి రూ.2,20,000 వ‌ర‌కు ఉంటుంది.

8. మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుకు నెల‌కు రూ.75,000

9. బిజినెస్ ప్ర‌మోష‌న్ క‌న్స‌లెంట్ పోస్టుకు నెల‌కు రూ.60,000

అర్హ‌తలు

విద్యా అర్హ‌తులు ఒక్కో పోస్టుకు ఒక్కో ర‌కంగా ఉంటుంది. అలాగే అనుభ‌వం అర్హ‌త‌కు సంబంధించి కూడా పోస్టులు వారీగా వేర్వేరుగా ఉంది. అధికారిక వెబ్‌సైట్‌ https://vpt.shipping.gov.in/ లోని కెరిర్‌లో పూర్తి వివ‌రాలు ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఆఖ‌రు తేదీ

1. నాలుగు విభాగాల్లో చీఫ్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్, మేనేజ‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ మార్చి 31

2. డిప్యూటీ చీఫ్ ఇంజ‌నీర్ (సివిల్‌) పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ ఏప్రిల్ 21

3. చీఫ్ అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ మార్చి 21

4. ట్రాఫిక్ మేనేజ‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ మార్చి 28

5. సీనియ‌ర్ మెరైన్ ఇంజ‌నీర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ ఏప్రిల్ 8

6. మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ మార్చి 31 (ఇంట‌ర్వ్యూ)

7. బిజినెస్ ప్ర‌మోష‌న్ క‌న్స‌లెంట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆఖ‌రు తేదీ మార్చి 21

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం