Visakha NSTL Apprentice Posts : విశాఖ ఎన్ఎస్టీఎల్ లో 53 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి
Visakha NSTL Apprentice Posts : విశాఖ ఎన్ఎస్టీఎల్ సంస్థలో 53 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15లోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
విశాఖపట్నంలోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కి సంబంధించిన నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ టేబరేటరీ (ఎన్ఎస్‌టీఎల్) సంస్థలో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటీఫికేషన్ విడుదల అయింది. మొత్తం 53 పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిసెంబర్ 15 తేదీ లోగా దరఖాస్తులను దాఖలు చేసుకోవాలి.
పోస్టులు ఎన్ని?
విశాఖపట్నంలో ఎన్ఎస్‌టీఎల్‌లో 53 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. బీటెక్, బీఈ (గ్రాడ్యుయేట్) కు 14, టెక్నిషియన్ (డిప్లొమా) 15, ఐటీఐ (ట్రేడ్) 24 పోస్టులు భర్త చేస్తారు.
అర్హతలు
1. బీటెక్, బీఈ పోస్టులకు ఈఈఈ, మెకానికల్, సీఎస్ఈ, నావల్ రీసెర్చ్, ఈసీసీ, ఈఅండ్ఐ వంటి బ్రాంచ్‌లను పూర్తిచేసి ఉండాలి.
2. టెక్నిషియన్ (డిప్లొమా) పోస్టులకు డీసీసీపీ, ఈఈఈ, మెకానికల్, సీఎస్ఈ, కెమికల్, ఫుడ్ సైన్స్, హోటల్ మేనేజ్‌మెంట్, క్వాలటీ క్రంటోల్, ఈఅండ్ఐ వంటి బ్రాంచ్‌లను పూర్తి చేసి ఉండాలి.
3. ఐటీఐ (ట్రేడ్) ఫోటోగ్రాఫర్, డిజిటల్ ఫోటో గ్రాఫర్, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, వెల్డర్, డీజీల్, మోటర్ మెకానిక్, సీఓపీఏ, మెకానిస్టు, ట్రూనర్ వంటి ట్రేడ్‌లను పూర్తి చేసి ఉండాలి.
నెలవారీ స్టైఫండ్
నెలవారీ స్టైఫండ్ ఒక్కో బ్రాంచ్‌కు ఒక్కోలా ఉంటుంది. బీటెక్, బీఈ (గ్రాడ్యుయేట్) కు రూ.9,000, టెక్నిషియన్ (డిప్లొమా) రూ.8,000, ఐటీఐ (ట్రేడ్)లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.
వయో పరిమితి
ఈ పోస్టులకు 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేదు. అలాగే దరఖాస్తు ఫీజు కూడా లేదు. మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లొడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు
1. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, బీఈ సర్టిఫికేట్లను అప్లొడ్ చేయాలి.
2. కుల ధ్రువీకరణ పత్రం
3. స్టడీ సర్టిఫికేట్ ఉండాలి.
4. దివ్యాంగు సర్టిఫికేట్
7. ఫోటో గుర్తింపు కార్డు
8. ఆధార్ కార్డ, బ్యాంక్ పాస్‌బుక్
9. ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్
10. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్
11. రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు
దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ https://nats.education.gov.in/index.php లో దాఖలు చేసుకోవాలి. డిసెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం