DRDO Jobs : విశాఖ డీఆర్‌డీవోలో 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వాక్ ఇన్ ఇంటర్వ్యూలతో భర్తీ
DRDO Jobs : విశాఖపట్నం డీఆర్డీవోలో 7 పోస్టుల భర్తీకి నోటిఫికేష్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 19, 20 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
DRDO Jobs : విశాఖపట్నం డీఆర్‌డీవోలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం ఇంటర్వ్యూతోనే ఖాళీలను భర్తీ చేస్తారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని డీఆర్‌డీవో ఆహ్వానిస్తోంది. డీఆర్‌డీవో విశాఖపట్నం డైరెక్టర్ జీవీ కృష్ణ కుమార్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

డీఆర్‌డీవో విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబ్ (ఎన్ఎస్‌టీఎల్)లో ఖాళీగా ఉన్న ఏడు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్) ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. రెండేళ్ల కాలపరిమితితో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. అవసరమైతే ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఎన్ని ఖాళీలు భర్తీ ?
మొత్తం ఏడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అందులో మెకానికల్ ఇంజినీరింగ్ -2, ఎలక్ట్రానిక్స్ -2, నావల్ ఆర్కిటెక్చర్-1, ఎరోస్పేస్, సీఎఫ్‌డీ -1, కంప్యూటర్ సైన్స్-1 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అర్హతలు
ఆయా సబ్జెక్ట్‌ల్లో బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. నెట్ లేదా గేట్ క్లియర్ చేసి ఉండాలి.
వయో పరిమితి
ఇంటర్వ్యూ 28 ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వయస్సు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ప్రభుత్వ రంగ సంస్థలు, అటానమస్ బాడీల్లో పని చేసినట్లు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటర్వ్యూకి హాజరుకావల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి.
ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్లు
1. విద్యా అర్హతకు సంబంధించిన మార్కుల జాబితా
2. బర్త్ సర్టిఫికేట్ (పదో తరగతి మార్కుల జాబితా)
3. నెట్, గేట్ స్కోర్ కార్డు
4. కుల ధ్రువీకరణ పత్రం
5. ఆధార్ కార్డు
6. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
ఏ ఖాళీలకు ఎప్పుడు ఇంటర్వ్యూలు?
ఇంటర్వ్యూలను రెండు రోజులు నిర్వహిస్తారు. నావల్ ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 19న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అలాగే మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా, అందుబాటులో ఉన్న ఖాళీలు, భవిష్యత్తులో ఆశించే ఖాళీల కోసం ప్యానల్ ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ఈ ప్యానెల్ పనిచేస్తుంది.
ఇంటర్వ్యూ ఎక్కడ ?
ఏడు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నావల్ సైన్స్ & టెక్నాలాజికల్ లాబొరేటరీ, విజ్ఞాన్ నగర్, ఎన్ఏడీ జంక్షన్ దగ్గర, విశాఖపట్నంలో జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి అదనపు సమచారం, అలాగే అప్లికేషన్ కోసం ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.drdo.gov.in/drdo/sites/default/files/career-vacancy-documents/advtNSTL_JRF10012025.pdf ను క్లిక్ చేయాలి. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఖాళీలను పూరించి, ఇంటర్వ్యూకు తీసుకుని వెళ్లాలి. అప్లికేషన్‌కు సంబంధిత పత్రాలను జత చేయాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు