NDA exam 2025: నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్; అప్లై చేశారా?
NDA exam 2025: ఎన్డీఏ అండ్ ఎన్ఏ 1 ఎగ్జామ్ 2025 రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31తో ముగియనుంది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లొ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 406 సీట్లకు గానూ 2025 ఏప్రిల్ 13న పరీక్ష నిర్వహిస్తారు.
NDA exam 2025: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నేవల్ అకాడమీ (NA) పరీక్ష (1) 2025 కోసం రిజిస్ట్రేషన్ల గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మొత్తం 406 సీట్లు
మొత్తం 406 సీట్లకు యూపీఎస్సీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ
ఆర్మీ: 208 (మహిళా అభ్యర్థులకు 10 సీట్లు)
నేవీ: 42 (మహిళా అభ్యర్థులకు 6 సీట్లు)
ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్: 92 (మహిళా అభ్యర్థులకు 2 సీట్లు
ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీలు (టెక్): 18 (మహిళా అభ్యర్థులకు 2 సీట్లు)
ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీలు (నాన్ టెక్): 10 (మహిళా అభ్యర్థులకు 2 సీట్లు)
ఖాళీలు తాత్కాలికమైనవి. ఈ సంఖ్య నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), ఇండియన్ నేవల్ అకాడమీల శిక్షణ సామర్థ్యం లభ్యతను బట్టి మారవచ్చు.
అప్లికేషన్లలో మార్పులు
గడువులోగా పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి 1 నుంచి 7 వరకు తమ ఫారాల్లో సవరణలు చేసుకోవచ్చు. యూపీఎస్సీ 2025 ఏప్రిల్ 13న ఎన్డీఏ, ఎన్ఏ, సీడీఎస్ 1 పరీక్షలను నిర్వహించనుంది.
యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్ఏ 1, 2025: దరఖాస్తు చేయడానికి దశలు
- యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయండి.
- 'వాట్స్ న్యూ' సెక్షన్ కింద 'వ్యూ ఆల్' ట్యాబ్ ఓపెన్ చేయండి.
- అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయండి.
- మీరు కొత్త అభ్యర్థి అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- ఇప్పుడు, మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫామ్ నింపండి.
- అప్లికేషన్ ఫీజును చెల్లించండి.
- అవసరమైన డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.
- ఫారమ్ సబ్మిట్ చేయండి.
- కన్ఫర్మేషన్ పేజీ ని సేవ్ చేయండి.
అర్హత వివరాలు..
జూలై 2, 2006, జూలై 1, 2009 మధ్య జన్మించిన అవివాహిత పురుష / మహిళా అభ్యర్థులు మాత్రమే ఎన్డిఎ & ఎన్ఎ పరీక్షకు దరఖాస్తు చేయడానికి అర్హులు. మరిన్ని వివరాలకు ఎగ్జామ్ నోటిఫికేషన్ చూడండి. కాగా, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDS 1, 2025) దరఖాస్తు ప్రక్రియ కూడా డిసెంబర్ 31తో ముగుస్తుంది.