2026 సంవత్సరానికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మే 24న, మెయిన్ పరీక్షను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2026
2026 సంవత్సరానికి గానూ పరీక్ష క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం విడుదల చేసింది.
వివిధ యూపీఎస్సీ పరీక్షల తేదీలు
యూపీఎస్సీ విడుదల చేసిన ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం..
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 24న, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21, 2026న జరగనున్నాయి.
యూపీఎస్సీ సీఎస్ఈ 2026 నోటిఫికేషన్ జనవరి 14న విడుదల చేస్తారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (యూపీఎస్సీ ఎన్డీఏ/ఎన్ ఏ, సీడీఎస్ 1) ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న జరగనుంది.
ఐఈఎస్ 2026 నోటిఫికేషన్ 2026 ఫిబ్రవరి 11వ తేదీన వస్తుంది. మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షనను జూన్ 9వ తేదీన నిర్వహిస్తారు.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ కు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 18న వస్తుంది. మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. జూలై 19న పరీక్ష ఉంటుంది.
పరిస్థితులను బట్టి నోటిఫికేషన్ తేదీలు, పరీక్షల ప్రారంభం, వ్యవధిని మార్చే అవకాశం ఉందని యూపీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు పరీక్ష క్యాలెండర్ ను చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్.
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.