యూపీఎస్సీ సివిల్స్ 2025 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల; ఈ డెరెక్ట్ లింక్ తో చెక్ చేసుకోండి-upsc cse prelims result 2025 declared at upsc gov in direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  యూపీఎస్సీ సివిల్స్ 2025 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల; ఈ డెరెక్ట్ లింక్ తో చెక్ చేసుకోండి

యూపీఎస్సీ సివిల్స్ 2025 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల; ఈ డెరెక్ట్ లింక్ తో చెక్ చేసుకోండి

Sudarshan V HT Telugu

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ ద్వారా తమ రిజల్ట్ ను చూసుకోవచ్చు.

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు విడుదల (Priyanka Parashar/Mint)

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిలిమినరీ ఫలితాలను జూన్ 11న విడుదల చేసింది. సీఎస్ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025కు హాజరైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.

ఉత్తీర్ణులైన వారు మెయిన్స్ కు

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. మెయిన్స్ లో, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా తుది మెరిట్ జాబితాను యూపీఎస్సీ రూపొందిస్తుంది. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ 2025 ఆగస్టు 22న జరగనుంది.

మే 25న ప్రిలిమ్స్

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025ను మే 25, 2025న నిర్వహించారు. పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లు ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి రెండు గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 200 మార్కులకు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో మూడింట ఒక వంతు (0.33) మినహాయించబడుతుంది.

979 ఖాళీలు

ఈ నియామక పరీక్ష ద్వారా 979 ఖాళీలను భర్తీ చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో బెంచ్ మార్క్ డిసెబిలిటీ కేటగిరీ కింద అభ్యర్థులకు 38 ఖాళీలను కేటాయించారు. వారిలో అంధత్వం లేదా తక్కువ దృష్టి ఉన్నవారికి 12, చెవిటి లేదా వినికిడి లోపం ఉన్నవారికి 7, లోకోమోటర్ వైకల్యం ఉన్నవారికి 10, చెవిటి-అంధత్వంతో సహా బహుళ వైకల్యం ఉన్నవారికి 9 ఖాళీలను కేటాయించారు.

ప్రతిష్టాత్మక సర్వీసులు

యూపీఎస్సీ ప్రతీ సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) సహా పలు కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీని నిర్వహిస్తుంది.

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ ఫలితాలు 2025: రిజల్ట్ ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా:

అభ్యర్థులు తమ సీఎస్ఈ ప్రిలిమ్స్ ఫలితాలు 2025ను ఈ క్రింది దశలను అనుసరించి చెక్ చేసుకోవచ్చు.

  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  • యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ ఫలితాలు 2025 లింక్ పై క్లిక్ చేయండి.
  • మీ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • స్క్రీన్ పై మీ సీఎస్ఈ ప్రిలిమ్స్ ఫలితం కనిపిస్తుంది.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం పేజీని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ పెట్టుకోవాలి.
  • మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమినరీ రిజల్ట్స్ 2025 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.