UPSC CSE 2025 : యూపీఎస్‌ఈ సీఎస్ఈ 2025 అప్లికేషన్ చివరి తేదీ రేపే.. అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో-upsc cse 2025 extended application deadline ends tomorrow check direct link to apply ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Upsc Cse 2025 : యూపీఎస్‌ఈ సీఎస్ఈ 2025 అప్లికేషన్ చివరి తేదీ రేపే.. అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో

UPSC CSE 2025 : యూపీఎస్‌ఈ సీఎస్ఈ 2025 అప్లికేషన్ చివరి తేదీ రేపే.. అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో

Anand Sai HT Telugu Published Feb 17, 2025 02:04 PM IST
Anand Sai HT Telugu
Published Feb 17, 2025 02:04 PM IST

UPSC Application Form 2025 : 2025 సంవత్సరానికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి సమయం దగ్గర పడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 979 ఖాళీలను భర్తీ చేస్తారు. యూపీఎస్సీ సీఎస్ఈ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 ఫిబ్రవరి 18తో ముగుస్తుంది.

యూపీఎస్‌ఈ సీఎస్ఈ 2025
యూపీఎస్‌ఈ సీఎస్ఈ 2025

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను 18 ఫిబ్రవరి 2025న ముగించనుంది. అధికారిక నోటఫికేషన్ ప్రకారం.. CS(P)-2025, IFoS(P)-2025 దరఖాస్తులు ఫిబ్రవరి 18, 2025 సాయంత్రం 6 గంటల వరకు అంగీకరిస్తారు. మీరు కూడా దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే, upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా upsconline.gov.in ద్వారా మీ దరఖాస్తు ఫారాన్ని సమర్పించండి.

చివరి తేదీ

మొదట దరఖాస్తుకు చివరి తేదీ 11 ఫిబ్రవరి 2025గా ఉండేది. అయితే దీనిని కమిషన్ 18 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించింది. అభ్యర్థులు 19 ఫిబ్రవరి 2025 నుండి 25 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు ఫారంలో సవరణలు చేయవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈసారి యూపీఎస్సీ సీఎస్ఈ ద్వారా 979 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2025 పరీక్ష మే 25న జరగనుంది.

వయస్సు

దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల కనీస వయస్సు 21 ఏళ్లు, గరిష్ట వయస్సు 32 ఏళ్లుగా నిర్ణయించారు. అభ్యర్థుల వయస్సును 2025 ఆగస్టు 1 ఆధారంగా లెక్కిస్తారు. అభ్యర్థుల పుట్టిన తేదీ ఆగస్టు 2, 1993 కంటే ముందు, ఆగస్టు 1, 2004 తర్వాత ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హతలు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 32 సంవత్సరాల వయోపరిమితితో మొత్తం 6 ప్రయత్నాలు లభిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 35 ఏళ్ల వరకు 9 అవకాశాలు లభిస్తాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 37 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎన్నిసార్లు అయిన పరీక్షకు హాజరుకావొచ్చు.

ఓటీఆర్

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) పూర్తి చేయాలి. ఇది జీవితకాలం చెల్లుతుంది. ఇప్పటికే నమోదు చేసుకున్న వారు నేరుగా దరఖాస్తు ప్రక్రియను కొనసాగించవచ్చు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు సెషన్లలో నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక, సిలబస్ ను కమిషన్ వెబ్సైట్ లో చూసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు

అభ్యర్థులు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. మహిళా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Anand Sai

eMail
Whats_app_banner

సంబంధిత కథనం