యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ 2024 విడుదల; టాప్ ర్యాంకర్ శక్తి దూబే; తెలుగమ్మాయికి 11వ ర్యాంక్-upsc civil services results declared shakti dubey gets top rank ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ 2024 విడుదల; టాప్ ర్యాంకర్ శక్తి దూబే; తెలుగమ్మాయికి 11వ ర్యాంక్

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ 2024 విడుదల; టాప్ ర్యాంకర్ శక్తి దూబే; తెలుగమ్మాయికి 11వ ర్యాంక్

Sudarshan V HT Telugu

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ విడుదల అయ్యాయి. ఈ ఏడాది సివిల్స్ పరీక్షలో తెలుగమ్మాయి ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం కు చెందిన బన్నా వెంకటేష్ 15వ ర్యాంక్ సాధించారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ 2024 విడుదల

సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 22న ప్రకటించింది. ఈ పరీక్షలో టాప్ ర్యాంకర్ గా శక్తి దూబే నిలిచారు. ఈ ఏడాది సివిల్స్ పరీక్షలో తెలుగమ్మాయి ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం కు చెందిన బన్నా వెంకటేష్ 15వ ర్యాంక్ సాధించారు. వెంకటేష్ గత సంవత్సరం 462 ర్యాంక్ సాధించి ఐపీఎస్ కు ఎంపికయ్యారు. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2024 ఇంటర్వ్యూ కు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ తుది ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.inలో చూసుకోవచ్చు.

రిజల్ట్స్ పేజీలో అభ్యర్థుల పేర్లు

UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో తుది ఫలితాలను షార్ట్‌లిస్ట్ ఫార్మాట్‌లో ప్రకటించింది. ఫలితాల పత్రంలో నియామకానికి ఎంపికైన అభ్యర్థుల పేర్లు ఉంటాయి. దేశంలో అత్యంత పోటీ పరీక్షలలో ఒకటి యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్టుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరిగే ఈ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్ మరియు ఇతర గ్రూప్ A మరియు B కేంద్ర సర్వీసుల వంటి ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పైన పేర్కొన్న మూడు దశలలో ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ రౌండ్. ప్రిలిమ్స్ దశలో క్వాలిఫై అయినవారు మిగతా రెండు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.

సివిల్ సర్వీసెస్ 2024 టాపర్స్ వీరే..

యూపీఎస్సీ సివిల్స్ 2024 టాపర్స్ వీరే..

1. శక్తి దూబే

2. హర్షిత గోయల్

3. డోంగ్రే అర్చిత్ పరాగ్

4. షా మార్గి చిరాగ్

5. ఆకాష్ గార్గ్

6. కోమల్ పునియా

7. ఆయుషి బన్సల్

8. రాజ్ కృష్ణ ఝా

9. ఆదిత్య విక్రమ్ అగర్వాల్

10. మయాంక్ త్రిపాఠి

జనవరి 7 నుంచి ఇంటర్వ్యూలు

2024 రిక్రూట్‌మెంట్ పరీక్ష సెషన్‌లో, ఇంటర్వ్యూ రౌండ్ జనవరి 7న ప్రారంభమై ఏప్రిల్ 17న ముగిసింది. సివిల్ సర్వీసెస్ 2024 లో ఉత్తీర్ణత సాధించిన 1,009 మంది అభ్యర్థులను యూపీఎస్సీ రికమెండ్ చేసింది.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ 2024 ఎలా చెక్ చేయాలి?

తుది ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.

3. కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ రోల్ నంబర్లను చెక్ చేసుకోవాలి.

4. ఫైలును డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

రిక్రూట్మెంట్ డ్రైవ్ సంస్థలో 1,009 పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 14న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 మార్చి 5న ముగిసింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం