UPSC CSE : యూపీఎస్​ఈ సీఎస్​ఈ రిజిస్ట్రేషన్​ గడువు మళ్లీ పొడిగింపు..-upsc civil services prelims exam 2025 registration deadline extended again ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Upsc Cse : యూపీఎస్​ఈ సీఎస్​ఈ రిజిస్ట్రేషన్​ గడువు మళ్లీ పొడిగింపు..

UPSC CSE : యూపీఎస్​ఈ సీఎస్​ఈ రిజిస్ట్రేషన్​ గడువు మళ్లీ పొడిగింపు..

Sharath Chitturi HT Telugu
Published Feb 19, 2025 11:32 AM IST

యూపీఎస్​ఈ సీఎస్​ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ గడువును మళ్లీ పొడిగించారు. ఫిబ్రవరి 21, సాయంత్రం 6 గంటల వరకు upsc.gov.in, upsconline.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

యూనియన్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్
యూనియన్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్

యూనియన్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​ఈ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్​ 2025 కోసం రిజిస్ట్రేషన్​ గడువును మరోసారి పొడిగించింది. అభ్యర్థులు ఇప్పుడు ఫిబ్రవరి 21, సాయంత్రం 6 గంటల వరకు upsc.gov.in, upsconline.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

యూపీఎస్​ఈ సీఎస్​ఈ ప్రిలిమ్స్​​ రిజిష్ట్రేషన్​ ప్రక్రియ..

ముందుగా, యూపీఎస్​ఈ సీఎస్​ఈ ప్రిలిమ్స్ 2025 రిజిస్ట్రేషన్​ గడువు ఫిబ్రవరి 11న ముగియాల్సి ఉంది. దాన్ని ఫిబ్రవరి 18కి పొడిగించారు. ఇప్పుడు ఈ డేట్​ ఫిబ్రవరి 21కి మారింది.

“సీఎస్​(పీ)‐2025- ఐఎఫ్​ఓఎస్​(పీ)‐2025 కోసం దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 21.02.2025 (సాయంత్రం 06:00) వరకు మరింత పొడిగించాము. అంతేకాకుండా, 7 రోజుల సవరణ కాలం ఇప్పుడు 22.02.2025 నుంచి 28.02.2025 వరకు అందుబాటులో ఉంటుంది,” అని ఇటీవలి నోటిఫికేషన్​ పేర్కొది.

యూపీఎస్​ఈ 2025 ద్వారా వివిధ సర్వీసులలో సుమారు 979 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వన్​-టైమ్​ రిజిస్ట్రేషన్​ (ఓటీఆర్​) ప్రొఫైల్‌ను సృష్టించడం తప్పనిసరి. ఇది ప్రొఫైల్ జీవితకాలం వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రొఫైల్‌ను సృష్టించిన వారు నేరుగా దరఖాస్తు ఫామ్‌ను పూర్తిచేయవచ్చు.

యూపీఎస్​ఈ సీఎస్​ఈ పరీక్ష 2025 గురించి..

యూపీఎస్​ఈ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్ష 2025 మే 25, 2025న నిర్వహిస్తారు. ఈ పరీక్షలో రెండు భాగాలు ఉన్నాయి - ప్రిలిమ్స్, మెయిన్స్. పరీక్ష వివరణాత్మక స్కీమ్​, సిలబస్ వంటి వివరాలు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆబ్జెక్టివ్-టైప్​ ప్రశ్నలకు తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

యూపీఎస్​ఈ సీఎస్​ఈ 2025: అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు..

యూపీఎస్​ఈ సీఎస్​ఈ 2025కి హాజరు కావడానికి కనీస విద్యా అర్హత గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ.

గ్రాడ్యుయేషన్ డిగ్రీ పరీక్ష ఫలితాలు ఇంకా వెలువడిన అభ్యర్థులు తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ/వ్యక్తిత్వ పరీక్షకు అర్హత సాధించినట్లయితే, వారు అర్హత పరీక్షను ఉత్తీర్ణులయ్యారని నిరూపించాలి.

మెడికల్, డెంటల్, పశువైద్య శాస్త్రం, సమానమైన డిగ్రీలు ఉన్న అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినట్లు రుజువును సమర్పించాలి.

ఇంటర్న్‌షిప్ ఇంకా పూర్తి చేయని మెడికల్ లేదా ఇతర ప్రొఫెషనల్ అర్హతలు ఉన్న అభ్యర్థులు తాత్కాలికంగా యూపీఎస్​ఈ ప్రిలిమ్స్​ 2025కి హాజరు కావడానికి అనుమతి ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో, వారు డిగ్రీ సర్టిఫికెట్, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినట్లు రుజువును సమర్పించాలి.

ఆగస్టు 1, 2025 నాటికి, అభ్యర్థులకు కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు- గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ. 100. కాగా మహిళా/SC/ST/బెంచ్‌మార్క్ వికలాంగుల వర్గ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

అన్​రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు యూపీఎస్​ఈ సీఎస్​ఈకి ఆరు ప్రయత్నాల వరకు అనుమతి ఉంది. ఓబీసీ అభ్యర్థులు పరీక్షకు తొమ్మిది సార్లు ప్రయత్నించవచ్చు.

SC లేదా ST అభ్యర్థులకు ప్రయత్నాల సంఖ్యకు పరిమితి లేదు.

సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి మరింత సమాచారం కోసం, అభ్యర్థులు యూపీఎస్​ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం