UPSC CSE 2025: సివిల్స్ ప్రిలిమ్స్ అప్లై చేసేందుకు లాస్ట్ డేట్ ను పొడిగించిన యూపీఎస్సీ
UPSC CSE 2025: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025 రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తున్నట్లు యూపీఎస్సీ శనివారం ప్రకటించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2025 కు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. సీఎస్(పీ)-2025, ఐఎఫ్ఓఎస్(పీ)-2025కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
గడువు తేదీ పొడిగింపు..
సివిల్స్ ప్రిలిమ్స్ 2025 కి అప్లై చేసుకోవడానికి గడువు తేదీని 2025 ఫిబ్రవరి 18 వరకు పొడిగించారు. కరెక్షన్ విండో ఫిబ్రవరి 19న ప్రారంభమై 2025 ఫిబ్రవరి 25న ముగుస్తుంది. "సిఎస్ (పి)-2025 & ఐఎఫ్ఓఎస్ (పి)-2025 దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 18.02.2025 (సాయంత్రం 06:00 గంటలు) వరకు పొడిగించారు. దరఖాస్తు విండో ముగిసిన మరుసటి రోజు నుంచి అంటే 19.02.2025 నుంచి 25.02.2025 వరకు 7 రోజుల కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది’’ అని యూపీఎస్సీ అధికారిక నోటీసులో పేర్కొన్నారు. 2025 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025 ఫిబ్రవరి 11 కాగా, దాన్ని మరో వారం రోజులు, అంటే ఫిబ్రవరి 18 వరకు పొడిగించారు.
ఓటీఆర్ ప్రొఫైల్
అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఓటీఆర్ ప్రొఫైల్ జీవితకాలం చెల్లుబాటు అవుతుందని, ఇప్పటికే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వారు నేరుగా అప్లికేషన్ ఫామ్ నింపవచ్చని యూపీఎస్సీ తెలిపింది.
ఇలా అప్లై చేసుకోండి..
- అభ్యర్థులు ముందుగా upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో ఉన్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లింక్పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు ఇప్పటి వరకు ఓటీఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకపోతే, ముందుగా, ఓటీఆర్ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు మళ్లీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
4. తర్వాత ప్రొఫైల్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
6. కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని, తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోండి.
979 ఖాళీలు
దరఖాస్తు ఫీజు రూ.100. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. ఈ ఏడాది సుమారు 979 ఖాళీలకు పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.