Civil Services exam 2025: 2025 సివిల్స్ నోటిఫికేషన్ విడుదల; మొత్తం ఖాళీల సంఖ్య ఇదే..-upsc civil services exam 2025 notification released for 979 vacancies ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Civil Services Exam 2025: 2025 సివిల్స్ నోటిఫికేషన్ విడుదల; మొత్తం ఖాళీల సంఖ్య ఇదే..

Civil Services exam 2025: 2025 సివిల్స్ నోటిఫికేషన్ విడుదల; మొత్తం ఖాళీల సంఖ్య ఇదే..

Sudarshan V HT Telugu
Jan 22, 2025 03:30 PM IST

Civil Services exam 2025: 2025 సంవత్సరానికి గానూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష నోటిఫికేషన్ ను యూపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఏడాది సుమారు 979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ సీఎస్ఈ 2025 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 ఫిబ్రవరి 11న ముగుస్తుంది.

 2025 సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
2025 సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

Civil Services exam 2025: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2025 కోసం అధికారిక నోటిఫికేషన్ ను అధికారిక వెబ్ సైట్ లో upsc.gov.in విడుదల చేసింది. ఈ ఏడాది సుమారు 979 ఖాళీలకు సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహించనున్నారు.

yearly horoscope entry point

లాస్ట్ డేట్ ఫిబ్రవరి 11

2025 సంవత్సరానికి గానూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 11. ఆ తేదీలోపు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఓటీఆర్ ప్రొఫైల్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వారు నేరుగా అప్లికేషన్ ఫామ్ నింపవచ్చు.

ఓటీఆర్ ప్రొఫైల్ కరెక్షన్

ఓటీఆర్ ప్రొఫైల్ ను ఒకసారి సవరించుకోవడానికి అభ్యర్థులను యూపీఎస్సీ అనుమతిస్తుంది. కొత్త అభ్యర్థుల విషయంలో ఓటీఆర్ సవరణకు ఈ నెల 18 వరకు అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ సీఎస్ఈ 2025 కరెక్షన్ విండో నుంచి దరఖాస్తు ఫిబ్రవరి 12న ప్రారంభమై ఫిబ్రవరి 18న ముగుస్తుంది. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్ష 2025 మే 25న జరగనుంది.

ఈ సర్వీసుల్లో..

యూపీఎస్సీ సీఎస్ఈ 2025 పరీక్ష ఈ కింది సర్వీసులకు నిర్వహిస్తారు.

  1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
  2. ఇండియన్ ఫారిన్ సర్వీస్
  3. ఇండియన్ పోలీస్ సర్వీస్
  4. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  5. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  6. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ 'ఎ'
  7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  8. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  9. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  11. ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  12. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ట్రాఫిక్), గ్రూప్ 'ఎ'
  13. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (పర్సనల్), గ్రూప్ 'ఎ'
  14. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (అకౌంట్స్), గ్రూప్ 'ఎ'
  15. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ'
  16. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ పరోక్ష పన్నులు) గ్రూప్ 'ఎ'
  17. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్కమ్ ట్యాక్స్) గ్రూప్ 'ఎ'
  18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ 'ఎ' (గ్రేడ్ 3)
  19. ఆర్మ్ డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి' (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
  20. ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీసెస్ (డీఏఎన్ఐసీఎస్), గ్రూప్ 'బి'
  21. ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీస్ (డీఏఎన్ఐపీఎస్), గ్రూప్ 'బి'
  22. పాండిచ్చేరి సివిల్ సర్వీసెస్ (పీడీఐసీఎస్), గ్రూప్ 'బి'
  23. పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ (పాండిప్స్), గ్రూప్ 'బి'

పరీక్ష విధానం

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు సెషన్లలో నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక, సిలబస్ ను కమిషన్ వెబ్సైట్ లో చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు తప్పుగా సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

విద్యార్హతలు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు హాజరు కావడానికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ కు అర్హత సాధిస్తే పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు రుజువు సమర్పించాలి. ఎంబీబీఎస్/బీడీఎస్/వెటర్నరీ సైన్స్ తదితర కోర్సులు, తత్సమాన డిగ్రీ కోర్సుల్లో ఉత్తీర్ణులు కూడా అర్హులే. ఎంబీబీఎస్ లేదా మెడికల్ డిగ్రీకి దారితీసే ఇతర ప్రొఫెషనల్ అర్హతలు ఉండి ఇంటర్న్ షిప్ పూర్తి చేయని వారిని తాత్కాలికంగా హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో డిగ్రీ సర్టిఫికెట్, ఇంటర్న్ షిప్ పూర్తయినట్లు రుజువు సమర్పించాల్సి ఉంటుంది.

వయోపరిమితి

ఆగస్టు 1, 2025 నాటికి దరఖాస్తుదారుడికి కనీసం 21 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా, 32 ఏళ్లు మించకూడదు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అన్ రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులు యూపీఎస్సీ సీఎస్ఈ కి ఆరుసార్లు ప్రయత్నించవచ్చు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు పరీక్ష రాయవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రయత్నాల సంఖ్యకు పరిమితి లేదు.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు రూ.100. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తుకు సంబంధించి గైడెన్స్, సమాచారం లేదా స్పష్టత కావాలంటే క్యాంపస్ లోని గేట్ 'సి' సమీపంలోని యూపీఎస్సీ(upsc recruitment) ఫెసిలిటేషన్ కౌంటర్ ను వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా 011-23385271/011-23381125/011-23098543లో సంప్రదించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం తెరిచి ఉంటుంది.

Whats_app_banner