కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) 1 పరీక్ష 2025 అడ్మిట్ కార్డులను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లేదా upsconline.gov.in ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ ను ఉపయోగించుకోవచ్చు.
ఏప్రిల్ 13న సీడీఎస్ 1 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షను మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుందని, ఈ సమయంలో అభ్యర్థులు ఇంగ్లిష్ పేపర్ కు హాజరవుతారని తెలిపారు. రెండో షిఫ్టులో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు జనరల్ నాలెడ్జ్ పేపర్, మూడో షిఫ్ట్ లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రవేశం కోసం యూపీఎస్సీ సీడీఎస్ నిర్వహిస్తారు. 457 ఖాళీలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
సీడీఎస్ 1 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను అనుసరించవచ్చు:
మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని యూపీఎస్సీ సూచిస్తోంది.
సంబంధిత కథనం