University Of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో ఎంబీఏ అడ్మిషన్లు- ఇవి తెలుసుకోండి..-university of hyderabad opens mba admissions for 2025 27 see full details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  University Of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో ఎంబీఏ అడ్మిషన్లు- ఇవి తెలుసుకోండి..

University Of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో ఎంబీఏ అడ్మిషన్లు- ఇవి తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu
Jan 03, 2025 09:00 AM IST

University Of Hyderabad MBA admissions : యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో ఎంబీఏ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, అప్లికేషన్​ గడువు- ఫీజు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో ఎంబీఏ అడ్మిషన్లు..
యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో ఎంబీఏ అడ్మిషన్లు..

ఎంబీఏ కోర్సు చేయాలనుకుంటున్న విద్యార్థులకు అలర్ట్​! యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​ (యూఓహెచ్​).. 2025-27 అకాడమిక్​ సెషన్​కి సంబంధించిన ఎంబీఏ ప్రోగ్రామ్​ అప్లికేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. acad.uohyd.ac.in లేదా uohyd.ac.in వంటి అధికారిక వెబ్​సైట్స్​లో ఎంబీఏ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్​కి చివరి గడువు జనవరి 15, 2025 అని గుర్తుపెట్టుకోండి.

yearly horoscope entry point

యూఓహెచ్​లో ఎంబీఏ కోర్సుకు అప్లై చేయాలని భావిస్తున్న అభ్యర్థులు ఐఐఎం- కోల్​కతా నిర్వహించిన క్యాట్​ 2024 పరీక్ష రాసి ఉండాలి. షార్ట్​లిస్ట్​ అయిన అభ్యర్థులకు గ్రూప్​ డిస్కషన్​, పర్సనల్​ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

ఈ ఎంబీఏ కోర్సులో భాగంగా 30 సీట్లు ఓసీ, 11 సీట్లు ఎస్​సీ, 6 సీట్లు ఎస్టీ, 20 సీట్లు ఓబీసీ, 8 సీట్లు ఈడబ్ల్యూఎస్​కి కేటాయించడం జరిగింది. 4 సీట్లు పీహెచ్​, డీపీ అభ్యర్థులకు ఇకేటాయించారు.

యూఓహెచ్​లో ఎంబీఏ కోర్సు- అర్హత..

యూజీసీ గుర్తించిన వర్సిటీల నుంచి కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్​ డిగ్రీ. 2025 జూన్​లోపు ఈ డిగ్రీ పొంది ఉండాలి. అయితే 2025 జూన్​లో పరీక్ష రాసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. 2024 నవంబర్​ 24న నిర్వహించిన క్యాట్​ పరీక్షకు హాజరై ఉండాలి.

అప్లికేషన్​ ఫీజు-

  • జనరల్​- రూ. 600
  • ఈడబ్ల్యూఎస్​- రూ. 550
  • ఓబీసీ- రూ. 400
  • ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూడీ- రూ. 275

ఒక్కసారి కట్టిన ఫీజును తిరిగి చెల్లించడం జరగదు.

క్యాట్​ 2024 వివరాలు..

క్యాట్​ 2024 ఫలితాల్ని ఐఐఎం కోల్​కతా డిసెంబర్​ 20న విడుదల చేసింది. నవంబర్​ 2024లో జరిగిన ఈ పరీక్షలో 14 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్​ని సాధించారు. క్యాట్​ 2024 పరీక్షకు 3.29లక్షల మంది రిజిస్టర్​ చేసుకోగా.. 2.93లక్షల మంది ఎగ్జామ్​కు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్​ విద్యార్థులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. కాగా మహిళల కన్నా పురుషులే ఎక్కువ మంది ఈ ఎగ్జామ్​ రాశారు. ఇక 100 పర్సెంటైల్​ సాధించిన 14మందిలో 13మంది ఇంజినీరింగ్​కి చెందిన వారే ఉన్నారు. మరోవైపు 29మంది 99.99 పర్సెంటైల్​ని నమోదు చేశారు. వీరిలో 24మంది ఇంజినీర్లు, నలుగురు నాన్​- ఇంజినీరింగ్​ విభాగానికి చెందిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ 29మందిలో 27 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇక 30 మంది విద్యార్థులు 99.98 పర్సెంటైల్​ని సాధించగలిగారు.

వివిధ ఐఐఎంలు క్యాట్​ 2024 స్కోర్​ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి ఇంటర్వ్యూ కోసం లెటర్లు పంపిస్తాయి . ఐఐఎంలే కాదు 86 నాన్-ఐఐఎం వ్యవస్థలు సైతం మేనేజ్​మెంట్​ విద్య కోసం ఈ క్యాట్​ ఫలితాలను ప్రమాణికంగా తీసుకుంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం