HCU Recruitment 2025 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 40 ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు!
HCU Recruitment 2025 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి.అర్హులైన వారు ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 40 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
రేపే చివరి తేదీ:
ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు హెచ్ సీయూ హైదరాబాద్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే హార్డ్ కాపీని ఫిబ్రవరి 24వ తేదీలోపు " ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్ మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ -500046, తెలంగాణ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. పోస్ట్ లేదా కొరియర్ చేయవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓబీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
అర్హతలు - జీతం వివరాలు….
ప్రొఫెసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు. ఇక అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100గా ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400 చెల్లిస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు చూస్తే… సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్
- మొత్తం ఖాళీలు - 40
- సబ్జెక్టులవారీగా వివరాలు - మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేస్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్,మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్ స్, ఎనిమల్ బయాలాజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ సైన్స్, కమ్యూనికేషన్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో ఖాళాలు ఉన్నాయి.
- దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం
- ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు - 20, ఫిబ్రవరి, 2025.(సాయంత్రం 5 గంటల లోపు)
- హార్డ్ కాపీని పంపాల్సిన చివరి తేదీ - 24 ఫిబ్రవరి 2025
పూర్తి నోటిఫికేషన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి…
సంబంధిత కథనం