HCU Recruitment 2025 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 40 ఖాళీలు, ముఖ్య వివరాలివే-university of hyderabad invites applications for 40 faculty positions know these details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Hcu Recruitment 2025 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 40 ఖాళీలు, ముఖ్య వివరాలివే

HCU Recruitment 2025 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - 40 ఖాళీలు, ముఖ్య వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 29, 2025 10:32 AM IST

HCU Recruitment 2025 : హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఖాళీలు (image source @HydUniv)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 40 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖ్య వివరాలను వెల్లడించింది.

yearly horoscope entry point

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీ.
  • ఉద్యోగాలు - టీచింగ్ పోస్టులు
  • మొత్తం ఖాళీల సంఖ్య - 40 ( ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు)
  • సబ్జెక్టుల వివరాలు - మ్యాథ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్ స్, ఎనిమల్ బయాలాజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ సైన్స్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లైడ్ లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్‌ లాంగ్వేస్‌ స్టడీస్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్ విభాగాల్లో ఖాళాలు ఉన్నాయి.
  • అర్హతలు - సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
  • జీతం - ఎంపికైన వారికి నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 చెల్లిస్తారు. ఇక అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100గా ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400 చెల్లిస్తారు.
  • దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు - 20, ఫిబ్రవరి, 2025.(సాయంత్రం 5 గంటల లోపు)
  • దరఖాస్తు ఫీజు - ఓబీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
  • దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ - 24, ఫిబ్రవరి, 2025.
  • హార్డ్ కాపీని " ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్ మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ -5 00046, తెలంగాణ చిరునామాకు పంపించాలి.
  • హార్డ్ కాపీని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
  • పూర్తి వివరాలను తెలుసుకునేందుకు https://uohyd.ac.in/careers-uoh వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ - https://curec.samarth.ac.in/index.php/search/site/index

Whats_app_banner

సంబంధిత కథనం