UoH MBA Admission 2025 : హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే అవకాశం.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి
UoH MBA Admission 2025 : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంబీఏ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. http://acad.uohyd.ac.in/ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ కేటగిరీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. పూర్తి వివరాలు ఇ ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. http://acad.uohyd.ac.in/ లింక్‌పై క్లిక్ చేసి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఐఐఎం- కలకత్తా ఇటీవల నిర్వహించిన క్యాట్-2024 కి హాజరైన అభ్యర్థులకు మాత్రమే అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
జనవరి 15 వరకు..
గతేడాది డిసెంబర్ 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 15 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. వీటి తేదీలను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైన తరువాత ప్రకటిస్తారు. జనరల్ కేటగిరీకి 30 సీట్లు అందుబాటులో ఉండగా.. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)లకు వరుసగా 11, 6 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
సీట్ల కేటాయింపు ఇలా..
అదేవిధంగా.. ఆర్థికంగా బలహీన నేపథ్యం ఉన్నవారికి 8 సీట్లు అందుబాటులో ఉన్నాయి. శారీరకంగా వికలాంగులు, ఇతరులపై ఆధారపడిన వారికి ఒక్కొక్కరికి 4 సీట్లను కేటాయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోర్సులు, అర్హత ప్రమాణాలు, నిర్దేశించిన ఫీజులు, రిజర్వేషన్ విధానాలపై మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సీటెట్ ఆన్సర్ కీ..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సీటెట్ ఆన్సర్ కీ 2024ను బుధవారం విడుదల అయ్యింది. ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్ ctet.nic.in ద్వారా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను కూడా విడుదల చేశారు.
జనవరి 5 వరకు..
అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ షీట్, ఆన్సర్ కీ జనవరి 5 వరకు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అభ్యంతరాలు తెలియజేయాలనుకునే అభ్యర్థులు జనవరి 5, 2025 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.1000 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.