HCU Recruitment 2024 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 42 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు-university of hyderabad faculty jobs applications ends on 9th december 2024 key details check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Hcu Recruitment 2024 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 42 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

HCU Recruitment 2024 : హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో 42 ఉద్యోగాలు - ఆన్ లైన్ దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 07, 2024 12:27 PM IST

Hyderabad Central University Recruitment : టీచింగ్ ఖాళీల భర్తీకి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 42 ఖాళీలున్నాయి. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులు మరో 2 రోజుల్లో ముగియనున్నాయి. అర్హులైన అభ్యర్థులు https://uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌ సెంట్రల్ వర్శిటీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటంది.

yearly horoscope entry point

మొత్తం 42 బ్యాక్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా 21 అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.సైన్స్‌, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్ స్టడీస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు విధానం…

అర్హులైన అభ్యర్థులు https://uohyd.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ. 1000 చెల్లించాలి. ఆన్ లైన్ లోనే కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అప్లికేషన్లు పంపవచ్చు. ఇందుకు డిసెంబర్ 16వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని వివరాలను నింపాలి. పూర్తి చేసిన ఫామ్ ను ఆఫ్‌లైన్ అప్లికేషన్లను ‘ ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్‌:- 221, మొదటి అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్, సి.ఆర్‌. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్- 500 04’ చిరునామాకు పంపించాలి.

42 ఖాలీలు - ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ నోటిఫికేషన్ - సెంట్రల్ వర్శిటీ, హైదరాబాద్‌.
  • ఉద్యోగాలు - టీచింగ్ ఖాళీలు
  • మొత్తం ఖాళీలు - 42(బ్యాక్ లాగ్)
  • ఖాళీల వివరాలు - ప్రొఫెసర్లు 20, అసోసియేట్ ప్రొఫెసర్లు 21, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 01 ఉద్యోగాలు ఉన్నాయి.
  • సబ్జెక్టులు : సైన్స్‌, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్ స్టడీస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
  • అర్హతలు - సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.
  • దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు -09 డిసెంబర్ 2024
  • ఆఫ్ లైన్ లో కూడా అప్లికేషన్లు పంపవచ్చు. ఇందుకు 16 డిసెంబర్ 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
  • ఎంపిక విధానం - అకడామిక్స్ తో పాటు ఇంటర్వ్యూ, డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://uohyd.ac.in/
  • అప్లికేషన్ లింక్ - https://curec.samarth.ac.in/index.php/search/site/index

వరంగల్ నిట్ లో ఖాళీలు:

నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి వరంగల్‌లోని ‘నిట్’(NIT) ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మొత్తం 56 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో అత్యధికంగా ఆఫీస్‌ అటెండెంట్, ల్యాబ్‌ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్‌, డిప్యూటేషన్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్