Union Bank Apprentice Recruitment 2025: యూనియన్ బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 2691 పోస్టులు
యూనియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://www.unionbankofindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2691 పోస్టులను భర్తీ చేయనున్నారు.
లాస్ట్ డేట్ మార్చ్ 5
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 19న ప్రారంభమై 2025 మార్చి 5న ముగుస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 01.04.2021 న లేదా తరువాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 2025 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి. అవి ఆన్ లైన్ ఎగ్జామినేషన్, నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, మెడికల్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ పరీక్షలో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులందరికీ పరీక్ష తేదీ, సమయంతో పాటు బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సీ నుంచి సమాచారం అందుతుంది. ఒక నిర్దిష్ట రాష్ట్రంలోని ట్రైనీ సీట్లకు దరఖాస్తు చేసే అభ్యర్థి, ఆ రాష్ట్రంలోని ఏదైనా ఒక స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అవగాహన) కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారిలో జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.800+జీఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.600+జీఎస్టీ, దివ్యాంగులకు రూ.400/- + జీఎస్టీ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
సంబంధిత కథనం