UGC NET provisional Answer Key 2024: యూజీసీ నెట్ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల; ఇలా చెక్ చేయండి..
UGC NET provisional Answer Key 2024: యూజీసీ నెట్ 2024 ఆన్సర్ కీ విడుదలైంది. యూజీసీ నెట్ 2024 రాసిన అభ్యర్థులు ఈ కింద వివరించిన స్టెప్స్ ఫాలో కావడం ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
UGC NET provisional Answer Key 2024: యూజీసీ నెట్ 2024 డిసెంబర్ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2024ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ https://ugcnet.nta.ac.in/ ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రికార్డు చేసిన సమాధానాలతో కూడిన ప్రశ్నాపత్రాన్ని కూడా ఈఅ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది.

ఆన్సర్ కీ పై అభ్యంతరాలు ఉంటే..
ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. ఫిబ్రవరి 3న సాయంత్రం 6 గంటలకు అభ్యంతర విండో లింక్ డీయాక్టివేట్ అవుతుంది. అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు. ప్రాసెసింగ్ ఫీజును క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ చెల్లింపు విధానాల ద్వారా చెల్లించవచ్చు.
డౌన్లోడ్ ఇలా..
ప్రొవిజనల్ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవాలంటే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
1. యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ https://ugcnet.nta.ac.in/ ను ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలో ఉన్న యూజీసీ నెట్ ఆన్సర్ కీ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
4. లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేస్తే ప్రొవిజనల్ ఆన్సర్ కీ కనిపిస్తుంది.
5. ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
వ్యక్తిగత సమాచారం పంపించరు
అభ్యర్థులు చేసిన సవాళ్లను సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా అభ్యర్థి సవాలు సరైనదని తేలితే, ఆన్సర్ కీని సవరించి, తదనుగుణంగా అభ్యర్థులందరి ప్రతిస్పందనలో వర్తింపజేస్తారు. సవరించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందించి ప్రకటిస్తారు. ఏ ఒక్క అభ్యర్థికి అతని / ఆమె సవాలును అంగీకరించడం / ఆమోదించకపోవడం గురించి వ్యక్తిగతంగా తెలియజేయబడదు. చివరగా, నిపుణులు ఖరారు చేసే ఆన్సర్ మాత్రమే ఫైనల్ అవుతుంది. 2025 జనవరి 2, 6, 7, 8, 9, 10, 16, 21, 27 తేదీల్లో యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్ష జరిగింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.