నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2025 పరీక్షలు ఈ నెల 25 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్‌ను ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. త్వరలో పరీక్షా కేంద్రం వివరాలతో కూడిన సిటీ స్లిప్‌లు, అడ్మిట్ కార్డులు కూడా విడుదల కానున్నాయి.
ఎన్టీఏ మొదట యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేస్తుంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతుంది. సిటీ స్లిప్‌ల ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉంటుందో తెలుసుకోవచ్చు. అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం, పరీక్ష వేళలు, పరీక్ష రోజు పాటించాల్సిన సూచనలు వంటి పూర్తి వివరాలు ఉంటాయి.
యూజీసీ నెట్ జూన్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 12తో ముగిసింది.
పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
యూజీసీ నెట్ జూన్ ప్రశ్నాపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. రెండు విభాగాల్లోనూ ఆబ్జెక్టివ్ తరహా, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండు విభాగాల మధ్య ఎటువంటి విరామం ఉండదు. పేపర్ Iకి 100 మార్కులు, పేపర్ IIకి 200 మార్కులు కేటాయించారు. లాంగ్వేజ్ పేపర్లు మినహా అన్ని ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లలో ఎంచుకున్న భాషలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
స్టెప్ 1- యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in ను సందర్శించండి.
స్టెప్ 2- 'UGC NET June 2025 admit card' లేదా 'exam city slip download' అని కినిపించే లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 4- వివరాలు సమర్పించి, పరీక్ష సిటీ స్లిప్/ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.
యూజీసీ నెట్ జూన్ 2025 ఎగ్జామ్ సిటీ స్లిప్, అడ్మిట్ కార్డుల విడుదల తేదీలకు సంబంధించిన వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు అధికారులు వెల్లడిస్తారని గతంలో ఒక నోటిఫికేషన్ పేర్కొంది.
యూజీసీ నెట్ అనేది జాతీయ స్థాయి అర్హత పరీక్ష. ఇది (i) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, (ii) అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పీహెచ్డీ ప్రవేశం, (iii) కేవలం పీహెచ్‌డీకి ప్రవేశం కోసం నిర్వహిస్తారు.
అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం