యూజీసీ నెట్ జనవరి 10 పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల.. డౌన్‌లోడ్ చేసేందుకు ఇదే డైరెక్ట్ లింక్
UGC Net January 10 Exam Admit Card : జనవరి 10, 2025న జరగనున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) కోసం ఎన్టీఏ అడ్మిట్ కార్డ్‌లను జారీ చేసింది. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.
ఎన్టీఏ జనవరి 10, 2025న జరగనున్న యూజీసీ నెట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌లను జారీ చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలోకి వెళ్లి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా వారి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ చేయాలి. పరీక్ష తేదీ, సమయం, వేదిక, వ్యక్తిగత సమాచారంతో సహా అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా చెక్ చేయాలి.
అనేక దశల్లో అడ్మిట్ కార్డులు
ఎన్టీఏ అనేక దశల్లో యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేస్తోంది. మొదట జనవరి 3 పరీక్ష అడ్మిట్ కార్డ్ జారీ చేసింది. తరువాత జనవరి 6, 7, 8 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి. మూడో దశలో జనవరి 9 పరీక్షకు అడ్మిట్ కార్డులు ఉన్నాయి. తాజాగా జనవరి 10 పరీక్ష అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే జనవరి 15, 16 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇంకా జారీ కాలేదు. యూజీసీ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటంది. మెుదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
అడ్మిట్ కార్డులు ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ugcnet.nta.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
హోమ్‌పేజీలో UGC NET Admit Card 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
మీ దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని నమోదు చేయండి.
అడ్మిట్ కార్డ్‌ని చూసేందుకు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
తర్వాత అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
సమస్యలుంటే సంప్రదించండి
అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ ప్రింటెడ్ కాపీని చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీతో పాటు పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. వెరిఫికేషన్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి చాలా ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు సమస్యలు రావడం, లేదంటే అందులో తప్పుడు ఉండటంలాంటి వాటి కోసం 011-40759000లో సంప్రదించవచ్చు. లేదా ugcnet@nta.ac.inకు ఇమెయిల్ చేయవచ్చు.