2025 జనవరి 3కు సంబంధించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. యూజీసీ నెట్ అడ్మిట్ కార్డును అభ్యర్థులు ugcnet.nta.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లాగిన్ విండోలో కనిపించే సందేశం ప్రకారం.. ఇతర పరీక్ష రోజుల అడ్మిట్ కార్డులు తరువాత విడుదల అవుతాయి.
జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో 85 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.
మొదటి షిఫ్ట్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులకు, రెండో షిఫ్ట్‌లో ఎకనామిక్స్ / రూరల్ ఎకనామిక్స్ / కోఆపరేషన్ / డెమోగ్రఫీ / డెవలప్మెంట్ ప్లానింగ్ / డెవలప్మెంట్ స్టడీస్ / ఎకనామెట్రిక్స్ / అప్లయిడ్ ఎకనామిక్స్ / డెవలప్మెంట్ ఎకనామిక్స్ / బిజినెస్ ఎకనామిక్స్ / మ్యూజియాలజీ అండ్ కన్జర్వేషన్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఈ సబ్జెక్టులకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పరీక్ష కేంద్రాలు ఏయే నగరాల్లో ఉంటాయో అభ్యర్థులకు తెలియజేసే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను కమిషన్ గతంలోనే విడుదల చేసింది.
అడ్మిట్ కార్డులపై అభ్యర్థులు పరీక్ష కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం, పరీక్ష రోజు సూచనలు మొదలైనవి తెలుసుకుంటారు. అడ్మిట్ కార్డుతో పాటు అండర్ టేకింగ్ ఫారం కూడా ఉంటుంది. అభ్యర్థులు ప్రింటెడ్ అడ్మిట్ కార్డులోని అన్ని పేజీలను (అండర్ టేకింగ్‌తో సహా) పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడంలో ఎవరికైనా ఇబ్బంది ఎదురైనా లేదా, అడ్మిట్ కార్డులోని వివరాల్లో ఏమైనా తప్పులున్నా 011- 40759000 నంబరుకు లేదా ugcnet@nta.ac.in ఈ-మెయిల్‌ని సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం