జూన్ 25న జరిగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. ఆ రోజు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డులకు ముందు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 25, 26, 27 పరీక్షలకు సంబంధించిన యూజీసీ నెట్ ఎగ్జామ్ సిటీ స్లిప్‌లను విడుదల చేసింది. పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అభ్యర్థులకు తెలియజేయడానికి ఎగ్జామ్ సిటీ స్లిప్‌లు ఉపయోగపడతాయి. అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రాల పేరు, చిరునామాతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్లు, పుట్టిన తేదీలను లాగిన్ వివరాలుగా ఉపయోగించాలి.
యూజీసీ నెట్ 2025 అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూజీసీ నెట్ పరీక్ష కోసం అభ్యర్థులు ఎగ్జామ్ సిటీ స్లిప్‌లను తీసుకెళ్లాల్సిన పని లేదు. కానీ అడ్మిట్ కార్డులను కచ్చితంగా తీసుకెళ్లాలని గుర్తుపెట్టుకోవాలి.
ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష జూన్ 25 నుంచి 29 వరకు జరుగుతుంది. ఇతర పరీక్షా తేదీల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల అవుతాయి.
యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు. ప్రశ్నపత్రాలు రెండు విభాగాలు కలిగి ఉంటాయి. అవి.. ఆబ్జెక్టివ్-టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు.
స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inకు వెళ్లండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో, UGC NET June 2025 admit card download linkపై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
స్టెప్ 4- మీ అడ్మిట్ కార్డును చెక్ చేసుకోండి.
స్టెప్ 5- పత్రాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.
ఇతర వివరాలతో పాటు, అడ్మిట్ కార్డులో ముఖ్యమైన పరీక్షా రోజు మార్గదర్శకాలు ఉంటాయి. అభ్యర్థులు పరీక్ష రోజున ఆ సూచనలను చదివి పాటించాలి.
జూన్ 26 నుంచి 29 మధ్య పరీక్షలు ఉన్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుల గురించి అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.
యూజీసీ నెట్ అనేది జాతీయ స్థాయి అర్హత పరీక్ష. ఇది (i) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, (ii) అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పీహెచ్డీ ప్రవేశం, (iii) కేవలం పీహెచ్‌డీకి ప్రవేశం కోసం నిర్వహిస్తారు.
సంబంధిత కథనం