అలర్ట్​! UGC NET 2025 సిటీ స్లిప్​లు విడుదల- పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలా?-ugc net 2025 city slip released admit card next see details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  అలర్ట్​! Ugc Net 2025 సిటీ స్లిప్​లు విడుదల- పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలా?

అలర్ట్​! UGC NET 2025 సిటీ స్లిప్​లు విడుదల- పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలా?

Sharath Chitturi HT Telugu

యూజీసీ నెట్​ 2025కి సంబంధించిన సిటీ స్లిప్​లను ఎన్టీఏ విడుదల చేసింది. వాటిని ఎలా చెక్​ చేసుకోవాలి? వాటిని పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

UGC NET 2025 అభ్యర్థులకు అలర్ట్​.. (Unsplash)

జూన్​ 25న జరగనున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్​) కోసం ఎగ్జామ్​ సిటీ ఇంటిమేషన్​ స్లిప్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. ఆ రోజు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ugcnet.nta.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూజీసీ నెట్​ సిటీ స్లిప్​ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్‌లు, పుట్టిన తేదీలను ఉపయోగించి యూజీసీ నెట్​ సిటీ ఇంటిమేషన్​ స్లిప్​ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

యూజీసీ నెట్​ 2025..

అడ్మిట్ కార్డులకు ముందు పరీక్షా నగర సూచన స్లిప్‌లను ఎన్టీఏ విడుదల చేస్తుంది. దీని ద్వారా అభ్యర్థులకు వారి పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ పత్రాన్ని పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోవాలి.

అడ్మిట్ కార్డులో, అభ్యర్థులు పరీక్షా కేంద్రం పేరు, చిరునామాతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. యూజీసీ నెట్​ 2025 పరీక్ష రోజున వారు అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని ఇతర సూచించిన పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

ప్రవేశ పరీక్ష జూన్ 25 నుంచి 29 వరకు జరుగుతుంది.

యూజీసీ నెట్ జూన్ 2025 రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండొవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి.

పరీక్షలోని ప్రశ్న పత్రాలు రెండు విభాగాలను కలిగి ఉంటాయి. అవి.. ఆబ్జెక్టివ్ టైప్​, మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలు.

పేపర్ Iకి 100 మార్కులు, పేపర్ IIకి 200 మార్కులు కేటాయించారు. లాంగ్వేజ్ పేపర్లు మినహా అన్ని ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లలో ఎంచుకున్న భాషలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

యూజీసీ నెట్ జూన్ 2025: ఎగ్జామ్​ సిటీ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

స్టెప్​ 1- అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in తెరవండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో, UGC NET June 2025 exam city slip లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ ఆధారాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి.

స్టెప్​ 4- మీ యూజీసీ నెట్​ ఎగ్జామ్​ సిటీ స్లిప్​ని చెక్​ చేసి, పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించమని సూచించారు.

యూజీసీ నెట్ అనేది జాతీయ స్థాయి అర్హత పరీక్ష. ఇది (i) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్​ఎఫ్​) అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, (ii) అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పీహెచ్​డీ ప్రవేశం, (iii) కేవలం పీహెచ్​డీకి ప్రవేశం కోసం నిర్వహిస్తారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం