UGC NET Exam Postponed : సంక్రాంతి పండుగ కారణంగా యూజీసీ నెట్ జనవరి 15 పరీక్ష వాయిదా
UGC NET Exam Postponed : డిసెంబర్ 2024కు సంబంధించి నిర్వహిస్తున్న యూజీసీ నెట్ పరీక్షల్లో ఒకటి వాయిదా పడింది. జనవరి 15న జరగాల్సిన నెట్ పరీక్ష కొత్త తేదీన నిర్వహించనున్నారు.
జనవరి 2025లో జరగనున్న యూజీసీ నెట్‌కు సంబంధించి ఒక పరీక్ష తేదీ మార్చారు. యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేస్తూ ఎన్టీఏ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో తాజా అప్డేట్ అందించింది. జనవరి 15, 2025న జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను ఇప్పుడు కొత్త తేదీన నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
'ఎన్‌టీఏకి చాలా సిఫార్సులు వచ్చాయి. పొంగల్, మకర సంక్రాంతి, ఇతర పండుగల దృష్ట్యా జనవరి 15, 2025 నాటి యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ ఉంది. విద్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని జనవరి 15, 2025న జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేయాలని ఎన్టీఏ నిర్ణయించింది.' అని పేర్కొన్నారు. అయితే జనవరి 16, 2025 పరీక్ష మునుపటి షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని గుర్తుంచుకోవాలి.
వాయిదాతో జనవరి 15 నాటి నెట్ పరీక్ష ఇప్పుడు వేరే తేదీలో నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి ఈ తేదీ ఏంటనే దానిపై ఎన్టీఏ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పరీక్షకు సంబంధించి కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని యూజీసీ నెట్ చెప్పింది. ఇది అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రకటిస్తామని వెల్లడించింది. కొత్త పరీక్ష కోసం యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ కూడా విడిగా జారీ చేస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు యూజీసీ వెబ్‌సైట్ ఫాలో అవ్వడం మంచిది.
యూజీసీ డిసెంబర్ 2024కు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలను జనవరి 3, 2025 నుండి జనవరి 16 వరకు నిర్వహించేలా షెడ్యూల్ ఉంది. తాజాగా జనవరి 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.. మాస్టర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం నిర్వహిస్తుంది. దీని ద్వారా అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, PhDలో ప్రవేశానికి అర్హత పొందుతారు. ప్రస్తుతం యూజీసీ నెట్ పరీక్ష మొత్తం 85 సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.
సంబంధిత కథనం