UCO Bank Recruitment : యూకో బ్యాంకులో 68 స్పెషలిస్ట్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి
UCO Bank Recruitment : యూకో బ్యాంకులో 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
UCO Bank Recruitment : కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యూకో బ్యాంకు రెగ్యులర్ ప్రాతిపదికన 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ మోడ్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి. లేని పక్షంలో వారి అప్లికేషన్ రిజెక్టు అవుతుంది. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ https://ucobank.com ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, ఇతర పత్రాలను కార్యాలయానికి పంపాల్సిన అవసరంలేదు.
యూకో బ్యాంకులో ఉద్యోగాల ఖాళీలు -68
1. ఎకనామిస్ట్ (జేఎంజీఎస్-I)-2 పోస్టులు
2. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (జేఎంజీఎస్-I)- 2 పోస్టులు
3. సెక్యూరిటీ ఆఫీసర్ (జేఎంజీఎస్-I)- 8 పోస్టులు
4. రిస్క్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- 10 పోస్టులు
5. ఐటీ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- 21 పోస్టులు
6. చార్టర్డ్ అకౌంటెంట్ (ఎంఎంజీఎస్-II)- 25 పోస్టులు
పోస్టులను అనుసరించి అభ్యర్థులు సీఏ/ ఎఫ్‌ఆర్‌ఎం/ సీఎఫ్‌ఏ, ఐసీఏఐ సర్టిఫికేషన్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 01-11-2024 నాటికి ఎకనామిస్ట్ పోస్టులకు 21- 30 ఏళ్లు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు 22-35 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 25-35 ఏళ్లు వయస్సు కలిగి ఉండాలి. నెలకు జేఎంజీఎస్-I పోస్టులకు రూ.48,170- రూ.85,920 వరకు, ఎంఎంజీఎస్-II పోస్టులకు రూ.64820 నుంచి రూ.93960 వరకు నెల వేతనం అందిస్తారు. అర్హులైన అభ్యుర్థలును అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజులు
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100, ఇతరులకు రూ.600
బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న వారికి అలర్ట్! బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ (bankofbaroda.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1267 మేనేజర్లు, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 28న ప్రారంభమై 2025 జనవరి 17న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్- పోస్టులు..
- డిపార్ట్మెంట్ - రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్: 200 పోస్టులు
- డిపార్ట్మెంట్ - రిటైల్ లయబిలిటీస్: 450 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్: 341 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 9 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఫెసిలిటీ మేనేజ్మెంట్: 22 పోస్టులు
- డిపార్ట్మెంట్ - కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్: 30 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఫైనాన్స్: 13 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 177 పోస్టులు
- డిపార్ట్మెంట్ - ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్: 25 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా 2024 అప్లికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 28న ప్రారంభమై 2025 జనవరి 17న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
సంబంధిత కథనం