TG TET Results 2025 : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి
TET Results 2025 in Telangana : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి స్కోర్ చెక్ చేసుకోవచ్చు. టెట్ స్కోర్ కు డీఎస్సీ రిక్రూట్ మెంట్ లో వెయిటేజీ ఉంటుంది.
తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయ్..! పరీక్షకు హాజరైన అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ లోకి స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.

మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,05,278 మంది పరీక్ష రాశారు. రెండు పేపర్లు కలిపి 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్-1లో 59.48 శాతం మంది, పేపర్-2లో 31.21 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు.
టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- తెలంగాణ టెట్(2) 2024 పరీక్ష రాసిన విద్యాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే TS TET(2) 2024 Results పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ లేదా జర్నల్ నెంబర్, ఎగ్జామ్ పేపర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
- భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాదిలో రెండు సార్లు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రెండో నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్షలు ఈ ఏడాది జనవరిలో జరిగాయి. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ తాజాగా ఫలితాలను ప్రకటించింది.
మరోవైపు ఈ ఏడాదిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5 నుంచి 6వేల మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.
టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు టెట్ స్కోర్ డీఎస్సీ పరీక్షలో కీలకంగా ఉంటుంది. డీఎస్సీ రిక్రూట్ మెంట్ లో టెట్ స్కోర్ కు వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలకు భారీ సంఖ్యలోనే టీచర్ అభ్యర్థులు హాజరవుతుంటారు.
సంబంధిత కథనం