కొన్ని వారాల్లో 1,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను నిలిపివేసింది ట్రంప్ సర్కార్. దీంతో పలువురు విద్యార్థులు ట్రంప్ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తున్నారు. అమెరికాలో ఉండేందుకు తనకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం హఠాత్తుగా ఉపసంహరించుకుందని చెబుతున్నారు. అమెరికాలో ఉండేందుకు ఫెడరల్ ప్రభుత్వం చట్టబద్ధమైన అనుమతిని ఉపసంహరించుకోవడంతో వందలాది మంది విద్యార్థులు నిర్బంధం, బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విద్యార్థులలో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం, ఒహియో స్టేట్ విశ్వవిద్యాలయం వంటి పెద్ద ప్రభుత్వ సంస్థలు, కొన్ని చిన్న కళాశాలల విద్యార్థులు ఉన్నారు.
లీగల్ స్టేటస్ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ప్రభుత్వమే నిర్భందించి బలవంతంగా వెళ్లగొట్టే అవకాశం ఉంది. పలు వర్సిటీలకు సంబంధించిన విద్యార్థులకు లీగల్ స్టేటస్ రద్దు అయ్యాయి. పలు కాలేజీల్లో విద్యార్థుల వీసాలు కూడా రద్దు అయ్యాయి. ఈ నిర్ణయం అమెరికాలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు సమస్యలను మరింత పెంచింది. అనేక మంది విద్యార్థులు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖపై దావా వేశారు. వీసాలు రద్దు చేయడానికి ఎటువంటి కారణం లేదని అన్నారు. కొంతమంది విద్యార్థులు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే తమ హోదాను మార్చిందని పేర్కొన్నారు.
యూనివర్శిటీ స్టేట్మెంట్లు, స్కూల్ అధికారులతో ఉత్తరప్రత్యుత్తరాలు, కోర్టు రికార్డులను ది అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ సమీక్షించింది. మార్చి నెలాఖరు నుంచి 160 కాలేజీలు, యూనివర్శిటీలకు చెందిన 1,024 స్టూడెంట్ వీసాలను రద్దు చేయడం, అమెరికాలో ఉండేందుకు వారి చట్టపరమైన అనుమతిని రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం తమ వీసాలను సరైన కారణం లేకుండా రద్దు చేయడం సరికాదని దాఖలైన వ్యాజ్యాలలో విద్యార్థులు పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి చిన్న చిన్న విషయాలకు సంబంధించి కొంతమంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, వీటిలో కొన్ని చాలా ముందుగానే జరిగాయని కళాశాలలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తమను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. కొలంబియా యూనివర్శిటీ యాక్టివిస్ట్ మహమూద్ ఖలీల్ నిర్బంధంతో సహా ఇతర హైప్రొఫైల్ కేసులు ఉన్నాయి. పాలస్తీనా అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతున్న అమెరికన్లు కాని వారిని బహిష్కరించేందుకు అనుమతించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది.
సంబంధిత కథనం