SVIMS Tirupati Recruitment 2025 : శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో 66 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్ - ముఖ్య తేదీలివే-tirupati sri venkateswara medical college released recruitment notification for 66 jobs ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Svims Tirupati Recruitment 2025 : శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో 66 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్ - ముఖ్య తేదీలివే

SVIMS Tirupati Recruitment 2025 : శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో 66 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్ - ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu
Published Feb 08, 2025 12:49 PM IST

SVIMS Tirupati Recruitment 2025 : రాష్ట్రంలో వైద్య‌ారోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 66 ఖాళీలు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తులకు ఫిబ్ర‌వ‌రి 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

శ్రీ వెంట‌కేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజీలో ఉద్యోగాలు
శ్రీ వెంట‌కేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజీలో ఉద్యోగాలు

తిరుప‌తి జిల్లా శ్రీ వెంక‌టేశ్వ‌ర ప్ర‌భుత్వ వైద్య కళాశాల, జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 19 కేట‌గిరీల్లో 66 పోస్టులు రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

వెంక‌టేశ్వ‌ర మెడిక‌ల్ కాలేజీలో 27 ఖాళీలు, వెంక‌టేశ్వ‌ర ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్ప‌ట‌ల్‌లో -27, ప్ర‌భుత్వ స్కూల్ ఆఫ్ న‌ర్సింగ్‌లో - 8, శ్రీ ప‌ద్మావ‌త‌మ్మ ప్ర‌భుత్వ కాలేజీ ఆఫ్ న‌ర్సింగ్‌లో - 1, ప్ర‌భుత్వ ప్ర‌సూతి హాస్ప‌టిల్‌లో- 3 పోస్టులు ఉన్నాయి. వీటిలో 15 పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలోనూ, 51 పోస్టుల‌ను అవుట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలోనూ భ‌ర్తీ చేయనున్నారు.

జీతాలు - ఖాళీల వివరాలు….

నెల‌వారీ జీతాలు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉంది. ల్యాబ్ అటెండెంట్ -7 (రూ.15,000), జనరల్ డ్యూటీ అటెండెంట్- 15 (రూ.15,000), లైబ్రరీ అటెండెంట్-1 (రూ.15,000), ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్-1 (రూ.32,670), డయాలసిస్ టెక్నీషియన్ - 1 (రూ.32,670), డేటా ఎంట్రీ ఆపరేటర్-3 (రూ.18,500) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

మహిళా నర్సింగ్ ఆర్డర్లీ-7 (రూ.15,000), పురుష నర్సింగ్ ఆర్డర్లీ-10 (రూ.15,000), ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్-2 (రూ.15,000), ఆడియోమెట్రీ టెక్నీషియన్-2 (రూ.32,670), ఎలక్ట్రీషియన్ / మెకానిక్-1 (రూ.22,460), అటెండర్లు-4 (రూ.15,000), ఫిజియోథెరపిస్ట్-2 (రూ.35,570), సి. ఆర్మ్ టెక్నీషియన్-2 (రూ.32,670), ఒ.టి. టెక్నీషియన్-2 (రూ.32,670), ఈఈజీ టెక్నీషియన్-2 (రూ.32,670), డయాలసిస్ టెక్నీషియన్-2 (రూ.32,670), అనస్థీషియా టెక్నీషియన్-1 (రూ.32,670), మార్చురీ మెకానిక్-1 (రూ.18,000) పోస్టు ఉంది.

నోటిఫికేష‌న్ షెడ్యూల్:

  • ద‌ర‌ఖాస్తు దాఖ‌లు - ఫిబ్ర‌వ‌రి 22 (సాయంత్రం 5 గంట‌ల‌) 2025. కేవ‌లం ఆఫీస్ ప‌ని దినాల్లోనే
  • ద‌ర‌ఖాస్తులు ప‌రిశీల‌న - ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3 , 2025
  • మెరిట్ లిస్ట్ విడుద‌ల - మార్చి 7న, 2025
  • మెరిట్ లిస్ట్‌పై అభ్యంత‌రాలు, ఫిర్యాదులు చేసేందుకు - మార్చి 10 నుంచి మార్చి 12, 2025
  • తుది మెరిట్ లిస్ట్ విడుద‌ల - మార్చి 15, 2025
  • స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్‌, అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్ అంద‌జేత - 24 మార్చి, 2025 నుంచి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జులై 1 వరకు 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వ‌య‌స్సు దాట‌కూడ‌దు.

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి…?

అప్లికేష‌న్ ఫీజు ఓసీ అభ్య‌ర్థుల‌కు రూ.300 ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు ఫీజు నుంచి మిన‌హాయింపు ఉంటుంది. అధికార వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలు నింపు దరఖాస్తుతో పాటు విద్యార్హ‌త‌లు, ఉద్యోగ అనుభ‌వాలతో కూడిన ఒక జిరాక్స్ కాపీ సెట్‌పై గెజిటెడ్ అధికారితో సంత‌కం చేయించాలి. ద‌ర‌ఖాస్తు సెట్‌ను ప్రిన్సిప‌ల్‌, ఎస్‌వీ మెడిక‌ల్ కాలేజీ, తిరుప‌తి, తిరుప‌తి జిల్లాకు ఫిబ్ర‌వ‌రి 22 తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం