Time management tips : ఈ ఒక్క టెక్నిక్ అలవాటు చేసుకుంటే పరీక్షల్లో మీరే టాప్..!
Pomodoro technique for time management : పరీక్షల్లో రాణించేందుకు లేదా చదువుపై దృష్టిపెట్టేందుకు ఒక సింపుల్, ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్మెంట్ టిక్నిక్ ఉంది. అదే పోమోడోరో టెక్నిక్. అది ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాము..
చదువుతున్న దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారా? ఏం చేసినా టార్గెట్‌ని రీచ్ అవలేక, పరీక్షల్లో సరిగ్గా పర్పార్మ్ చేయలేనని బాధపడుతున్నారా? అయితే మీరు ఈ హైలీ- ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్ అయిన “పోమోడోరో” గురించి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా సీఎస్ఈ, నీట్, క్యాట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థికి టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. కష్టపడి పనిచేసే ప్రతి విద్యార్థి టైమ్ మేనేజ్మెంట్ను సద్వినియోగం చేసుకుని పరీక్షల్లో రాణించాలి. పోమోడోరో టెక్నిక్ అంటే ఏంటంటే..
పోమోడోరో టెక్నిక్ అంటే ఏటి..
పోమోడోరో టెక్నిక్ అనేది మీ పనులను పూర్తి చేయడానికి సమయ నిర్వహణను సమర్థవంతంగా ఉపయోగించుకునే తెలివైన మార్గం. సిరిల్లో కన్సల్టింగ్ యజమాని ఫ్రాన్సిస్కో సిరిల్లో అభివృద్ధి చేసిన పోమోడోరో టెక్నిక్ సమర్థవంతమైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతి.
పోమోడోరో టెక్నిక్ ఒక పనిని చేసేటప్పుడు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఫలితంగా అధిక ప్రాడక్టివిటీ కనిపిస్తుంది.
పోమోడోరో టెక్నిక్‌ను ఎలా ఉపయోగించాలి..
పోమోడోరో టెక్నిక్‌లో ఇమిడి ఉన్న దశలు..:
- మీరు పూర్తి చేయాల్సిన పనిని గుర్తించండి. విద్యార్థులకు, ఇది పూర్తి చేయాల్సిన అధ్యయన భాగాల సమూహం కావచ్చు.
- టైమర్‌ను 25 నిమిషాల పాటు సెట్ చేయండి. దీని కోసం స్టాప్ క్లాక్/అలారం క్లాక్ ఉపయోగించండి. మీరు పనిని ప్రారంభించినప్పటి నుంచి, టైమర్‌ని 25 నిమిషాలకు సెట్ చేయండి. మీరు ఒక పెద్ద పనిని భాగాలుగా విభజించి 25 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
- మీ పనిని పూర్తి చేయడానికి కేటాయించిన ఈ సమయంలో అంకితభావంతో పనిచేయండి. కేటాయించిన 25 నిమిషాల పాటు చుట్టూ ఎటువంటి పరధ్యానం లేకుండా సరిగ్గా దృష్టి పెట్టండి.
- 25 నిమిషాల నంతరం అలారం మోగిన తర్వాత, 4-5 నిమిషాలు విరామం తీసుకోండి. బ్రేక్ టైం 5 నిమిషాలకు మించకుండా ఉండటానికి ప్రయత్నించండి.
- ఇప్పుడు విరామ సమయంగా 4-5 నిమిషాలతో తదుపరి 25 నిమిషాలు ఈ ప్రక్రియను మళ్లీ పునరావృతం చేయండి. ఇలా 3-4 సార్లు రిపీట్ చేయాలి.
- ప్రక్రియ పునరావృతమై, పని పూర్తయిన తర్వాత, మీరు మీ తదుపరి పనికి వెళ్లడానికి ముందు 30 నిమిషాలు సుదీర్ఘ విరామం తీసుకోండి.
మధ్యలో క్రమం తప్పకుండా స్వల్ప విరామ సమయం ఉండటం, పని సమయంలో దృష్టి కేంద్రీకరించడం ద్వారా, మీ పని నిర్ణీత సమయంలో పూర్తవుతుంది. మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది.
టాపర్స్ ఉపయోగించే అనేక అభ్యసన పద్ధతుల్లో ఇదొకటి. హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఫలితాల్ని ఇస్తుంది. స్మార్ట్ వర్క్ కూడా అంతే!
సంబంధిత కథనం