No Off On Sunday : ఇక్కడ ఆదివారం సెలవు ఉండదు.. సండే కూడా ఆఫీసులకు వెళ్లాల్సిందే!
No Off On Sunday : మనకు వారాంతం అంటే శని, ఆది. కానీ కొన్ని దేశాల్లో భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా సెలవు దినాల్లో మార్పు ఉంది. ఆదివారాలు సెలవు లేని దేశాలు ఏవి?
భారత్ నుంచి కొంతమంది విదేశాలకు వెళ్లి పనులు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో మనకు ఉన్నట్టుగానే శని, ఆదివారాలు సెలవులుగా ఉంటాయి. మరికొన్ని దేశాల్లో మాత్రం ఈ సెలవు దినాల్లో మార్పు ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో సెలవులు ఆదివారం ఇవ్వవు. సండే కూడా పనికి వెళ్తారు జనాలు. అలాంటి దేశాల లిస్ట్ చూద్దాం.. అయితే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆదివారం పని చేయడం వెనక మతపరమైన కారణాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లోని ప్రజలు ఆదివారం కూడా పని చేస్తుంటారు. ఇక్కడ వారాంతం శుక్రవారం, శనివారం. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో అత్యధిక జనాభా ఇస్లాంను అనుసరిస్తారు. దీనితో శుక్రవారం వారాంతపు రోజుగా జరుపుతారు. నమాజ్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం కూడా పనికి వెళ్లడానికి ఇది కారణం
ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ప్రజలు ఆదివారం కూడా పని చేస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్‌లోని యూదు సంస్కృతి కారణంగా, వారానికి సంబంధించి భిన్నమైన నమూనా ఉంటుంది. యూదుల షబ్బత్ శుక్రవారం సాయంత్రం, శనివారం సాయంత్రం జరుపుకొంటారు. శుక్రవారం, శనివారం వారాంతంగా పరిగణిస్తారు. ఆదివారం నుండి గురువారం వరకు పని చేయాల్సి ఉంటుంది.
ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్‌లో పని వారం ఆదివారం ప్రారంభమై గురువారంతో ఖతమ్ అవుతుంది. శుక్రవారం, శనివారాలు వారాంతాలుగా చూస్తారు. ప్రపంచంలోని ఇతర ఇస్లామిక్ దేశాల మాదిరిగానే ఆఫ్ఘనిస్తాన్‌లోని శుక్రవారం నమాజ్ చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలతో సహా అన్ని కార్యాలయాలు బంద్ చేస్తారు.
మలేషియా
మలేషియాలో కొన్ని రాష్ట్రాల్లో వారాంతం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. జోహోర్, కెడా, కెలాంతన్, తెరెంగాను రాష్ట్రాల్లో వారాంతం శుక్రవారం, శనివారంనాడు ఉంటుంది. ఇక్కడ ఇస్లాం ప్రార్థనలు శుక్రవారాల్లోనే చేయాలి. రాజధాని కౌలాలంపూర్ వంటి ఇతర ప్రాంతాలలో శని, ఆదివారం వారాంతం. దీనితో కొన్ని రంగాల్లో ప్రజలు ఆదివారం కూడా కార్యాలయాలకు వెళ్తుంటారు.
ఈ దేశాల్లోనూ
బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి చాలా గల్ఫ్ దేశాలు ఆదివారం నుండి గురువారం వరకు పని చేసేవి ఉన్నాయి. శుక్రవారం సెలవుదినం కాబట్టి ప్రజలు నమాజ్ చేయవచ్చు. అల్జీరియా, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, ఒమన్, సిరియాలాంటి మరికొన్ని దేశాల్లోనూ వారాంతం శుక్రవారం, శనివారాల్లో వస్తుంది.
టాపిక్