AP Inter Results 2025 : గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉత్తీర్ణత శాతం.. 2024 ఫలితాలు ఎలా ఉన్నాయి?-the pass percentage of inter students has increased this time compared to last year ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Inter Results 2025 : గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉత్తీర్ణత శాతం.. 2024 ఫలితాలు ఎలా ఉన్నాయి?

AP Inter Results 2025 : గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉత్తీర్ణత శాతం.. 2024 ఫలితాలు ఎలా ఉన్నాయి?

AP Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ చేశారు. గతేడాదితో పోలిస్తే.. ఉత్తీర్ణత శాతం పెరిగింది. దీనిపై మంత్రి లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాల ఫూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు (istockphoto)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి "హాయ్" మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చు.

లోకేష్ సంతృప్తి..

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం, రెండో సంవత్సరం విద్యార్థులకు 83 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

నిరాశ వద్దు..

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా.. ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47శాతంగా ఉంది. ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందకండని లోకేష్ సూచించారు. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేశారు.

2024 ఫలితాలు..

మొత్తం ఉత్తీర్ణత.. 78 శాతం

మొదటి సంవత్సరం ఉత్తీర్ణత.. 67 శాతం

రెండో సంవత్సరం ఉత్తీర్ణత.. 78 శాతం

బాలికలదే హవా..

మొదటి సంవత్సరం బాలికల ఉత్తీర్ణత.. 71 శాతం

మొదటి సంవత్సరం బాలుర ఉత్తీర్ణత.. 64 శాతం

రెండవ సంవత్సరం బాలికల ఉత్తీర్ణత.. 81 శాతం

రెండవ సంవత్సరం బాలుర ఉత్తీర్ణత.. 75 శాతం

వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం 71 శాతంగా ఉంది.

2025 ఇంటర్ ఫలితాలను ఈ లింక్ ద్వారా ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం