TSWREIS Recruitment 2025 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 65 ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
TSWREIS Recruitment 2025 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఐసీటీ, పీఆర్వో ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 65 ఉద్యోగాలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జనవరి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోని ఏడు జోన్లలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 63 ఐసీటీ(ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్‌స్ట్రక్టర్ ఖాళీలు ఉండగా.. మరో 2 పీఆర్వో పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 11 నెలల కాలపరిమితిగానూ వీరు పని చేయాల్సి ఉంటుంది. వారి పనితీరు, సేవలను సమీక్షించి… ఉద్యోగ సేవలను పునరుద్ధరిస్తారు.
దరఖాస్తు ఫామ్ లు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని దేశోద్ధారక భవన్‌లో సంస్థ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి.ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీటిని పొందవచ్చు. గడువు ముగిసిన తర్వాత… దరఖాస్తుల స్వీకరణ ఉండదని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
ఐసీటీ ఉద్యోగాలకు రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. వీరికి డీపీఓలకు చెల్లించే గౌరవ వేతనం ఉంటుంది.
ఐసీటీ ఉద్యోగాలకు ఎంటెక్/ బీటెక్/ ఎంఎస్సీ కంప్యూటర్/ ఎంసీఏ తో పాటు పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధన్యత ఉంటుంది. మొత్తం ఏడు జోన్లలో కలిపి 63 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. ఆరో జోన్ లో అత్యధికంగా 18 ఉద్యోగాలు ఉన్నాయి.
ఇక పీఆర్వో ఖాళీలు రెండు ఉన్నాయి. ఈ ఉద్యగాలకు జర్నలిజంలో డిగ్రీ తప్పనిసరి. అంతేకాకుండా... తెలుగు, ఆంగ్లంలో మంచి పరిజ్ఞానం ఉండాలి. ఉర్దూ వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు జర్నలిజంలో కనీసం 10 సంవత్సరాలపాటు పని చేసిన అనుభవం ఉండాలి. జూనియర్ పీఆర్వో పోస్టుకు ఎంఏ ఇంగ్లీష్ లేదా డిప్లోమా కలిగి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ లో టైపింగ్ చేసే నైపుణ్యం ఉండాలి. పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు కూడా జనవరి 10,2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం