త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఖాళీల వివరాలను తెలిపిన మంత్రి పొన్నం-tgsrtc to recruit 3038 vacancies soon says minister ponnam prabhakar ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఖాళీల వివరాలను తెలిపిన మంత్రి పొన్నం

త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ఖాళీల వివరాలను తెలిపిన మంత్రి పొన్నం

ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఖాళీల వివరాలను పేర్కొన్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలు

త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖాళీల వివరాలను వెల్లడించారు.

ఖాళీల వివరాలు ఇలా…

  • డ్రైవర్ ఉద్యోగాలు -2000
  • శ్రామిక్ -743
  • డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) - 84
  • డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) - 114
  • డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ - 25
  • అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ - 18
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) - 23
  • సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11
  • అకౌంట్ ఆఫీసర్స్ - 06
  • మెడికల్ ఆఫీసర్స్ జనరల్ - 07
  • మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ - 07

ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీ లో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వివరించారు. ఇప్పటికే మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని… త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని వివరించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం