TGPSC Group 2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాల్లో టాప్-10 ర్యాంకర్లు వీళ్లే, కమిషన్ వెబ్ సైట్ లో జనరల్ ర్యాంకింగ్ జాబితా-tgpsc group 2 results top 10 rankers announced general ranking list out ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాల్లో టాప్-10 ర్యాంకర్లు వీళ్లే, కమిషన్ వెబ్ సైట్ లో జనరల్ ర్యాంకింగ్ జాబితా

TGPSC Group 2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాల్లో టాప్-10 ర్యాంకర్లు వీళ్లే, కమిషన్ వెబ్ సైట్ లో జనరల్ ర్యాంకింగ్ జాబితా

TGPSC Group 2 Results : టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసింది. మొత్తం 600 మార్కులకు నిర్వహించిన పరీక్షల్లో తొలి 31 స్థానాలను అబ్బాయిలే సాధించారు. నారు వెంకట హర్షవర్ధన్ అనే అభ్యర్థి 447.088 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు.

తెలంగాణ గ్రూప్-2 ఫలితాల్లో టాప్-10 ర్యాంకర్లు వీళ్లే, కమిషన్ వెబ్ సైట్ లో జనరల్ ర్యాంకింగ్ జాబితా

TGPSC Group 2 Results : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. గ్రూప్-2 ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 600 మార్కులకు నిర్వహించిన పరీక్షల్లో నారు వెంకట హర్షవర్దన్‌ అనే అభ్యర్థి 447.088 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించారు. వడ్లకొండ సచిన్‌ కు రెండో ర్యాంకు, బి.మనోహర్‌ రావు మూడో ర్యాంక్ సాధించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో టాప్‌- 31 ర్యాంకులు అబ్బాయిలకే రావడం గమనార్హం.

గ్రూప్-2 ఫస్ట్ ర్యాంకర్ హర్షవర్ధన్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. ఆయన తండ్రి రమణారెడ్డి కేఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. హర్షవర్దన్ ఏడో తరగతి వరకు ఖమ్మంలో, 8వ నుంచి ఇంటర్ వరకు విజయవాడ, ఇంజినీరింగ్ తాడేపల్లిగూడెంలో చదివారు.

టీజీపీఎస్సీ గతేడాది డిసెంబర్ లో 783 గ్రూప్‌-2 పోస్టులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

గ్రూప్ -2 రిజల్ట్స్ టాప్‌ -10 ర్యాంకర్లు, మార్కులు

1. నారు వెంకట హర్షవర్దన్‌- 447.088 మార్కులు

2. వడ్లకొండ సచిన్‌ -444.754 మార్కులు

3. బి.మనోహర్‌రావు - 439.344 మార్కులు

4. శ్రీరామ్‌ మధు -438.972 మార్కులు

5. చింతపల్లి ప్రీతమ్‌ రెడ్డి -431.102 మార్కులు

6. ఎర్రా అఖిల్‌ -430.807 మార్కులు

7. గొడ్డేటి అశోక్‌ -425.842 మార్కులు

8. చిమ్ముల రాజశేఖర్‌ - 423.933 మార్కులు

9. మేకల ఉపేందర్‌ -423.119 మార్కులు

10. కరింగు నరేష్‌ -422.989 మార్కులు

  • గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు.
  • దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థులు- 5,51,855
  • నాలుగు పేపర్లకు హాజరైన మొత్తం అభ్యర్థులు -2,49,964
  • ఇన్ వ్యాలిడేటెడ్ అభ్యర్థుల సంఖ్య - 13,315
  • సాధారణ ర్యాంకింగ్ జాబితా అభ్యర్థుల సంఖ్య- 2,36,649

కమిషన్ వెబ్ సైట్ లో జనరల్ ర్యాంకింగ్ జాబితా

గ్రూప్-2 పరీక్ష మాస్టర్ ప్రశ్నాపత్రంతో పాటు జనరల్ ర్యాంకింగ్ జాబితా, ఫైనల్ కీలను అందుబాటులో ఉంచాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. వీటిని 11/03/2025 నుండి 09/04/2025 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. అభ్యర్థులు వారి TGPSC ID, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందుకున్న ఓటీపీతో వ్యక్తిగత లాగిన్‌ల నుంచి OMR షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ కీపై తదుపరి అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం లేదు.

జనరల్ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన సంఖ్యలో అభ్యర్థులను తీసుకుంటారు. అటువంటి అభ్యర్థులకు వ్యక్తిగతంగా, టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా కూడా సమాచారం అందిస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అవసరమైన అన్ని అసలు సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని టీజీపీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్‌ను ఫోన్ నంబర్లు: 040-23542185 లేదా 040-23542187 లేదా helpdesk@tspsc.gov.in కు ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం